NTR : చిరంజీవి గారు – బాలయ్య బాబాయ్ కలిసి నాటు నాటు డ్యాన్స్ వేస్తే.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్..

ఎన్టీఆర్ నాటు నాటు గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Published By: HashtagU Telugu Desk
Ntr Interesting Comments on Ram Charan Balakrishna Chiranjeevi and Naatu Naatu Song

Ntr Ram Charan Balakrishna Chiranjeevi

NTR : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన RRR సినిమా పెద్ద విజయం సాధించి అందులో నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు కూడా అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా నిన్న రాత్రి లండన్‌లోని ప్రతిష్ఠాత్మక రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో RRR సినిమాని ప్రదర్శించి కీరవాణితో లైవ్‌ కాన్సర్ట్‌ నిర్వహించారు. అనంతరం చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, కీరవాణి అక్కడి మీడియాతో, ప్రేక్షకులతో మాట్లాడారు.

ఈ క్రమంలో ఎన్టీఆర్ నాటు నాటు గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నాటు నాటు సాంగ్ చాలా స్పెషల్ మాకు. కేవలం ఆస్కార్ వచ్చిందనే కాదు, మేము ఆ పాటకు చాలా పెయిన్ అనుభవించాము. అంతకుమించి ఆ పాటలో నేను నా బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్ తో కలిసి డ్యాన్స్ చేశాను. చరణ్ అద్భుతమైన డ్యాన్సర్. చరణ్ వాళ్ళ నాన్న చిరంజీవి చాలా గొప్ప డ్యాన్సర్. అలాగే మా బాలకృష్ణ బాబాయ్ మంచి డ్యాన్సర్. చిరంజీవి గారు – బాల బాబాయ్ కలిసి నాటు నాటు సాంగ్ కు డ్యాన్స్ వేస్తే అది ఒక మంచి జ్ఞాపకంలా మిగులుతుంది అని అన్నారు.

దీంతో అక్కడ హాల్ ఓ ప్రేక్షకులు అరుపులతో సందడి చేయగా ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఎన్టీఆర్ కోరినట్టు చిరంజీవి, బాలకృష్ణ కలిసి నాటు నాటు పాటకు డ్యాన్స్ వేస్తారా చూడాలి.

 

Also Read : Ram Charan – NTR : ఎన్నాళ్లకెన్నాళ్లకు.. చరణ్,ఎన్టీఆర్ ఒకే వేదికపై.. హగ్ చేసుకొని.. ఇప్పటికైనా ఫ్యాన్ వార్స్ ఆపుతారా?

  Last Updated: 12 May 2025, 10:21 AM IST