Site icon HashtagU Telugu

NTR Hrithik Roshan : వార్ 2 ఎన్టీఆర్, హృతిక్ సాంగ్ కొరియోగ్రాఫర్ ఎవరో తెలుసా..?

NTR Hrithik Roshan Dance Choreography by Vaibhavi Merchant

NTR Hrithik Roshan Dance Choreography by Vaibhavi Merchant

NTR Hrithik Roshan యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత దేవర సినిమా చేస్తున్నాడు. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో ఎన్టీఆర్ కు జతగా జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈ సినిమాతో పాటుగా ఎన్టీఆర్ వార్ 2 లో కూడా భాగం అవుతున్నాడు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు.

స్క్రీన్ మీద ఎన్టీఆర్, హృతిక్ లను చూస్తే గూస్ బంప్స్ రావడాం పక్కా అని తెలుస్తుంది. వార్ 2 సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ ల మీద ఒక క్రేజీ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ లో నాటు నాటు సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. వార్ 2 లో కూడా అలాంటి ఒక డ్యాన్స్ నెంబర్ ని ప్లాన్ చేస్తున్నారట.

ఈ సాంగ్ ని అక్కడ క్రేజీ కంపోజర్ వైభవి మర్చంట్ కొరియోగ్రఫీ చేస్తారని తెలుస్తుంది. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కు డ్యాన్స్ కంపోజ్ చేసిన వైభవి తారక్, హృతిక్ ఇద్దరి కోసం కొరియోగ్రఫీ చేస్తుంది. ఈ సాంగ్ కచ్చితంగా నాటు నాటు రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

బాలీవుడ్ లో డ్యాన్స్ అంటే హృతిక్ రోషన్ గురించే చెప్పుకుంటారు. ఇక మన తారక్ డ్యాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరు కలిసి చేసే డ్యాన్స్ నెంబర్ కోసం ఫ్యాన్స్ అంతా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. వార్ 2 సినిమాలో కియరా అద్వాని ఒక హీరోయిన్ గా ఫిక్స్ అవ్వగా మరో హీరోయిన్ పై క్లారిటీ రావాల్సి ఉంది.