Site icon HashtagU Telugu

NTR : కాంతార ప్రీక్వెల్లో నటించేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్

Ntr Kantara 2

Ntr Kantara 2

కాంతార (Kanthara) ప్రీక్వెల్లో నటించేందుకు ఎన్టీఆర్ (NTR) సై అంటున్నాడు..మరి హీరో కామ్ డైరెక్టర్ రిష‌బ్ షెట్టి (Rishab Shetty) ఏమంటాడో..!! ప్రస్తుతం ఎన్టీఆర్ క‌ర్ణాట‌క లో బిజీ బిజీ గా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీతో క‌లిసి మంగ‌ళూరు వెళ్లిన ఎన్టీఆర్.. అక్క‌డ ఉన్న ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్నారు. శ‌నివారం నాడు ఉడిపిలోని శ్రీకృష్ణ మఠంను , కొల్లురులోని మూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. కాంతార న‌టుడు రిష‌బ్ శెట్టితో క‌లిసి ఉద‌యం పంచెక‌ట్టులో ఆల‌యానికి వెళ్లిన తార‌క్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంత‌రం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

We’re now on WhatsApp. Click to Join.

ద‌ర్శ‌నం అనంత‌రం ఆల‌యం నుంచి బ‌య‌ట‌కు వ‌స్తూ మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. రిష‌బ్ శెట్టితో క‌లిసి శ్రీకృష్ణ మఠం, మూకాంబిక అమ్మవారిని ద‌ర్శించుకోవ‌డం ఆనందంగా ఉంది. ఇటువంటి దివ్య‌మైన ప్ర‌దేశంలో సినిమాల అప్‌డేట్‌ల గురించి స్పందించాలని లేదు అంటూ వెల్ల‌డించాడు. అయితే ఒక రిపోర్ట‌ర్ అడుగుతూ.. కాంతార ప్రీక్వెల్‌లో మీరు నటిస్తున్నారు అని వార్త‌లు వ‌స్తున్నాయి అందులో నిజం ఎంత అని అడుగ‌గా.. రిష‌బ్ షెట్టి అలాంటివి ప్లాన్ చేయాలి. ఆయన ప్లాన్‌ చేస్తే చేయడానికి నేను రెడీగా ఉన్నా అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

ఇక కాంతార విషయానికి వస్తే..ఈ మూవీ అన్ని భాషల్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలియంది కాదు..చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయం సాధించడమే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీక్వెల్ షూటింగ్ నడుస్తుంది.

Read Also : PM Modi : భారత పారా అథ్లెట్లతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోడీ