NTR Goosebumps Words : ఆఖరి 40 నిమిషాలు ‘దేవర’ కట్టిపడేస్తుంది – ఎన్టీఆర్

NTR Goosebumps Words About Devara Movie Climax : ఇక సినిమా ఆఖరి 40 నిమిషాలు 'దేవర' ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తుందని ఎన్టీఆర్ తెలిపి అభిమానుల్లో ఆసక్తి మరింత పెంచారు.

Published By: HashtagU Telugu Desk
Ntr Devara Climax

Ntr Devara Climax

NTR Goosebumps Words About Devara Movie Climax : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దేవర ట్రైలర్ (Devara Trailer) వచ్చేసింది..ట్రైలర్ లో చూస్తుంటే సినిమాలో ఎన్టీఆర్ విశ్వరూపం చూపించాడని అర్ధం అవుతుంది. ఎన్టీఆర్ (NTR), RRR తర్వాత గ్యాప్ తీసుకొని దేవర సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఈ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. సినిమా విడుదలకు కేవలం 15 రోజులు మాత్రమే ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు. ఇప్పటికే మూడు పాటలను విడుదల చేసి సినిమా ఫై అంచనాలు పెంచేసిన మేకర్స్.. ఈరోజు ముంబై లో సినిమా ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. విడుదలై కొద్ది నిమిషాల్లోనే ఫ్యాన్స్ లైకులు షేర్స్ తో నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ లో కులం లేదు, మతం లేదు, భయం లేదు అంటూ ప్రకాష్ రాజ్ వాయిస్ తో దేవరను పరిచయం చేస్తారు. ఆ తర్వాత మనిషికి బ్రతికేంత దైర్యం చాలు, చంపెంత ధైర్యం కాదు అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సైఫ్ అలీఖాన్ డైలాగులు కూడా ఆకట్టుకున్నాయి. యాక్షన్స్ సీన్స్ అయితే అదిరిపోయాయి.

ట్రైలర్ రిలీజ్ సందర్భంగా కాస్త నర్వస్ గా ఉంది – ఎన్టీఆర్

ఈ ట్రైలర్ లో కులం లేదు, మతం లేదు, భయం లేదు అంటూ ప్రకాష్ రాజ్ వాయిస్ తో దేవరను పరిచయం చేస్తారు. ఆ తర్వాత మనిషికి బ్రతికేంత దైర్యం చాలు, చంపెంత ధైర్యం కాదు అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సైఫ్ అలీఖాన్ డైలాగులు కూడా ఆకట్టుకున్నాయి. యాక్షన్స్ సీన్స్ అయితే అదిరిపోయాయి. ఇక ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ..దాదాపు ఆరేళ్ల తర్వాత తన నుంచి వస్తున్న సోలో రిలీజ్ ‘దేవర’ అని చెప్పుకొచ్చారు. మల్టీస్టారర్ RRR తర్వాత రానున్న చిత్రమన్నారు. ట్రైలర్ రిలీజ్ సందర్భంగా కాస్త నర్వస్ గా ఉందని, ముంబైలో ఈ ఈవెంట్ జరగడం సంతోషంగా ఉందన్నారు. RRRకు ప్రమోషన్ సమయంలో నార్త్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని , ‘దేవర’ విషయంలోనూ ఇదే జరుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

దేవర లాస్ట్ 40 మినిషాలు వేరే లెవెల్..

ఇక సినిమా ఆఖరి 40 నిమిషాలు ‘దేవర’ (Devara Movie Climax) ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తుందని ఎన్టీఆర్ తెలిపి అభిమానుల్లో ఆసక్తి మరింత పెంచారు. ‘సినిమాలో ఫలానా చోటే యాక్షన్ బాగుంటుందని నేను చెప్పలేను. సినిమా అంతా అద్భుతంగా వచ్చింది. ఆ విజువల్స్ మీరు ఎప్పుడెప్పుడు చూస్తారా అని ఎదురుచూస్తున్నా. ట్రైలర్ ఆఖర్లో సొరచేపతో ఉన్న షాట్ను ఒక రోజంతా షూట్ చేశాం’ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ మాటలతో సినిమా ఫై మరింత అంచనాలు పెరగడం ఖాయం. ఇక ట్రైలర్ చూసిన సినీ లవర్స్ మాత్రం BGM ఇంకాస్త బాగుంటే అదిరిపోయేదంటున్నారు. ట్రైలర్లో కావాల్సినన్ని ఎలివేషన్స్ ఉన్నాయని, NTRకు మాస్ బొమ్మ పడబోతోందని అభిప్రాయపడుతున్నారు. ట్రైలర్లో లాస్ట్ సీన్ అదుర్స్ అని కామెంట్స్ చేస్తున్నారు.

Read Also : Hyderabad Air Quality: హైదరాబాద్‌లో ప్రమాదకర స్థాయికి చేరుకున్న గాలి కాలుష్యం

  Last Updated: 10 Sep 2024, 06:52 PM IST