Site icon HashtagU Telugu

NTR : తన తల్లి ఎన్నో ఏళ్ళ కోరికని.. రిషబ్ శెట్టి, నీల్ సహాయంతో నెరవేర్చిన ఎన్టీఆర్..

Ntr, Prashanth Neel, Rishab Shetty

Ntr, Prashanth Neel, Rishab Shetty

NTR : మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ ‘దేవర’ షూటింగ్ పూర్తి చేసి ప్రస్తుతం బ్రేక్ లో ఉన్నారు. షూటింగ్ సమయంలో చేతికి చిన్న గాయం అవ్వడంతో ప్రస్తుతం రెస్ట్ పీరియడ్ లో ఉన్నారు. ఇక ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ కుటుంబ భాద్యతల పై దృష్టి పెట్టారు. తన తల్లి షాలిని ఎన్నో ఎలా కలని ఇప్పుడు నెరవేర్చి కొడుకుగా తన బాధ్యతని నిర్వర్తించారు. కాగా ఎన్టీఆర్ తన తల్లి కోరికను తీర్చే పనికి దర్శకుడు ప్రశాంత్ నీల్ సహాయం చేశారట. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎన్టీఆర్ ఒక ట్వీట్ చేసారు.

ఎన్టీఆర్ తల్లి షాలిని కర్ణాటకకు చెందిన వ్యక్తి అని అందరికి తెలిసిందే. అక్కడ ఆమె సొంత ఊరు అయిన ‘కుండపుర’లో ప్రముఖ ఉడుపి శ్రీకృష్ణ మాత ఆలయం ఉంది. ఆ ఆలయానికి ఎన్టీఆర్ ని తీసుకు వెళ్లాలని తన తల్లి ఎప్పటినుంచో అనుకుంటున్నారట. కానీ ఎన్టీఆర్ సినిమాల బిజీ వలన, ఇన్నాళ్లు అది ఒక కలగానే మిగిలిపోయింది. అయితే ఎన్టీఆర్ కి ఇప్పుడు కొంచెం బ్రేక్ రావడం, అంతేకాకుండా మరో రెండు రోజుల్లో (సెప్టెంబర్ 2) తన తల్లి పుట్టినరోజు కూడా ఉంది. దీంతో ఆమెకు బర్త్ డే గిఫ్ట్ గా ఆ గుడికి వెళ్లాలని ఎన్టీఆర్ నిర్ణయించుకొని.. ఆమెతో కలిసి ఉడుపి శ్రీకృష్ణ మాతని దర్శించుకున్నారు.

కాగా ఈ కలని నెరవేర్చడంలో ఎన్టీఆర్ కి దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కందురు సహాయపడ్డారట. ఇక ఈ ప్రత్యేక మూమెంట్ ని మరింత ప్రత్యేకం చేయడం కోసం కాంతార హీరో రిషబ్ శెట్టి కూడా వారితో పాటు ఉడుపి శ్రీకృష్ణ మాతని దర్శించుకున్నారు. ఈక్రమంలోనే రిషబ్ శెట్టి స్వయంగా ఎయిర్ పోర్ట్ కి వెళ్లి ఎన్టీఆర్ ని రిసీవ్ చేసుకొని దగ్గరుండి గుడికి తీసుకు వెళ్లారు.