Site icon HashtagU Telugu

NTR : ఓయ్ అంటూ కోపంతో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..!

Ntr Fires On Photographer Oy Video Viral Social Media

Ntr Fires On Photographer Oy Video Viral Social Media

NTR మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఓ పక్క కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా చేస్తూనే మరోపక్క బాలీవుడ్ లో వార్ 2 సినిమాకు సైన్ చేశాడు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ తో ఎన్.టి.ఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ముంబై హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నాడు. లేటెస్ట్ గా ముంబైలో ఒక హోటల్ లో బస చేసేందుకు వెళ్తున్న ఎన్.టి.ఆర్ ను ఫాలో అవుతూ ఫోటో గ్రాఫర్స్ ఫోటోలు, వీడియోలు తీయబోయారు.

అది గమనించిన ఎన్టీఆర్ ఓయ్ అంటూ కసురుకున్నాడు. వైట్ షర్ట్ షార్ట్ హెయిర్, కళ్లకు అద్దాలు పెట్టుకుని ఫోన్ మాట్లాడుతున్నాడు ఎన్టీఆర్. ఫోటోలు తీస్తున్నారని గమనించి ఓయ్ అని అరిచాడు. ఇలా ఎన్టీఆర్ అరిచిన సందర్భాలు చాలా తక్కువ. సినిమాలో లుక్ రివీల్ అవ్వకూడదనే ఉద్దేశమా లేక తారక్ ఏదైనా ఆలోచనలో ఉండి అలా అరిచాడా అన్నది తెలియదు కానీ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

ఎన్టీఆర్ దేవర సినిమాను అక్టోబర్ 10న రిలీజ్ లాక్ చేశారు. ఈ మూవీతో ఎలాగైనా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ వైడ్ గా తన ఫ్యాన్స్ ని మెప్పించాలని చూస్తున్నాడు ఎన్టీఆర్. వార్ 2 సినిమాలో కూడా తన విశ్వరూపం చూపిస్తాడని తెలుస్తుంది.