NTR Fans: వైసీపీ జెండాలతో (YCP flags) థియేటర్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ (NTR Fans) నానా హంగామా చేసిన ఘటన ఇప్పుడు టీడీపీ (TDP) శ్రేణులకు నిద్ర పట్టకుండా చేస్తుంది. జూ. ఎన్టీఆర్ నటించిన దేవర (Devara) మూవీ భారీ అంచనాల మధ్య నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ నుండి వచ్చిన సోలో మూవీ కావడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ సినీ కెరియర్ లో ఎన్నడూ లేని విధంగా దేవర మూవీ వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున పలు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఇక థియేటర్స్ లలో అభిమానుల హంగామా గురించి ఎంత చెప్పిన తక్కువే..
దేవరలోని టైటిల్ సాంగ్ వచ్చే సమయంలో వైసీపీ జెండాతో అభిమానులు చిందులు వేసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారి, టీడీపీ శ్రేణులకు నిద్ర పట్టకుండా చేస్తుంది. గతంలో కూడా ఎన్టీఆర్ అభిమానులు జగన్ పార్టీకి మద్దతుగా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ ప్రస్తుతం అంత సెట్ అయ్యారని అంత భావిస్తున్న వేళ ఇలా వైసీపీ జెండాలు పట్టుకొని చిందులు వేయడం కాస్త ఆందోళనకు గురి చేస్తుంది.
ఇక దేవర ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికి వస్తే..
వరల్డ్ వైడ్‌గా ఫస్ట్ రోజే రూ. 172 కోట్ల కలెక్షన్లు రాబట్టింది దేవర. ఈ కలెక్షన్లతో ప్రభాస్ ఆదిపురుష్ పేరిటా ఉన్న (రూ.140 కోట్ల) రికార్డును బ్రేక్ చేసింది. ఇక ఎన్టీఆర్ కెరీర్‌లో ఇది హైయెస్ట్ కలెక్షన్లు అని చెప్పుకోవచ్చు. ఇక రానున్న రెండు రోజులు వీకేండ్‌తో పాటు దసరా సెలవులు వస్తుండటంతో ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇక డే1 అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాలలో చూసుకుంటే దేవర ఐదో స్థానంలో ఉంది. రూ. 223 కోట్లతో ఆర్ఆర్ఆర్ మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో బాహుబలి (రూ.217 కోట్లు) మూడో స్థానంలో కల్కి (రూ.180 కోట్లు) నాలుగో స్థానంలో సలార్ (రూ.178 కోట్లు) ఉన్నాయి.
Devara x YCP celebrations🇸🇱🔥🤙
NTR-YCP mutuals🤝#Devara #YSRCP #NTR #YSJagan pic.twitter.com/N0ihVlIk41— pasupu_putra_sundharavadana (@ntr_roars) September 27, 2024
Read Also : EX Minister Roja Comments: లడ్డూ కల్తీ వివాదంపై రోజా సంచలన వ్యాఖ్యలు