Site icon HashtagU Telugu

NTR Unhappy: రాజమౌళిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం.. అన్యాయం అంటూ కామెంట్స్!

Ntr And Rajamouli

Ntr And Rajamouli

ఆర్ఆర్ఆర్ మూవీ దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశాల్లో సైతం ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలనే ఈ మూవీ HCA అవార్డ్స్ లో హాలీవుడ్ చిత్రాలను అధిగమించి ఉత్తమ యాక్షన్ చిత్రంగా “RRR” ఎంపికైంది. రాజమౌళి, రామ్ చరణ్ లు అమెరికాలో సంబరాలు చేసుకుంటుంటే, ఎన్టీఆర్ అభిమానులు మాత్రం రాజమౌళి తమ హీరోకి అన్యాయం చేశారంటూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తాజా పరిణామాలు ఎన్టీఆర్‌ని కూడా బాధించాయని సమాచారం.

“RRR”లో దర్శకుడు రాజమౌళి రామ్ చరణ్‌ని అల్లూరి సీతా రామరాజు వేషంలో పర్ఫెక్ట్ గా చూపించాడు. రామ్ చరణ్ తన లుక్, నటనా నైపుణ్యంతో మరింత పేరు తెచ్చుకున్నాడు. అయితే ఎన్టీఆర్ కి అంత పాపులారిటీ రాలేదు. ఇదిలావుండగా, రాజమౌళి హాలీవుడ్‌లో ఎన్టీఆర్‌కు మీడియా కవరేజీని పెంచడానికి ప్రయత్నాలు చేశాడు. వారి మొదటి రౌండ్ ఆస్కార్ ప్రచార సమయంలో ఎన్టీఆర్ దృష్టిలో పడ్డారు. పెయిడ్ క్యాంపెయిన్ ఎన్టీఆర్‌కి మరింత ఎక్స్ పోజర్ అందేలా టీమ్ చూసుకుంది. మ్యాగజైన్ ఎన్టీఆర్ నటనపై కథనాలు రాస్తూ, ఆయన నటన ఆస్కార్ అవార్డుకు అర్హమైనదని కొనియాడారు. ఎన్టీఆర్ నటనకు ఉత్తమ నటుడిగా నామినేట్ అవుతుందని యుఎస్ఎ టుడే అంచనా వేసింది. ఎన్టీఆర్ అన్నీ నిజమని నమ్మాడు కానీ అలాంటిదేమీ జరగలేదు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కెమరూన్ రామ్ చరణ్ నటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అయితే హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ మాత్రం ఎన్టీఆర్ ని పొగడలేదు. ఈ పరిణామాలన్నీ ఎన్టీఆర్‌ని అసంతృప్తికి గురిచేశాయని అంటున్నారు. ఇకపై “RRR” ప్రమోషన్‌లకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నాడు. ఫలితంగా కొన్ని అవార్డ్ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.