Site icon HashtagU Telugu

Devara : దేవర లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్..?

Devara New Poster

Devara New Poster

దేవర లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారా..? అంటే అవుననే అంటున్నారు అభిమానులు. దీనికి కారణం తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టరే. నందమూరి అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీ ‘దేవర’ (Devara). ఎన్టీఆర్ (NTR) తో జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ మూవీ ని తెరకెక్కించిన కొరటాల శివ(Koratala Shiva)..మరోసారి ఎన్టీఆర్ తో దేవర పేరుతో రెండు పార్ట్స్ గా భారీ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పటికే ఈ సినిమా తాలూకా పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు రెట్టింపు చేస్తూ ఉన్నాయి. తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ఇప్పుడు వైరల్ గా మారింది. ది ఫేసెస్ ఆఫ్ ఫియర్’ అని దానికి క్యాప్షన్ తో పోస్టర్ ను రిలీజ్ చేయగా.. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తున్నారు. దీంతో ఈ పోస్టర్ ను చూసిన అభిమానులు ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లుందని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే దేవర లో మరో హీరోయిన్ కూడా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. మరాఠీ నటి శ్రుతి మరాఠే రెండో హీరోయిన్ గా చేస్తుందని అంటున్నారు. మరి నిజంగా ఆమె నటిస్తుందా..? లేదా అనేది చూడాలి.

ఇక ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ తోపాటు ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తీర ప్రాంతం కథ నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుంది. కాగా ఈ మూవీ లో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ తో పాటు ‘యానిమల్’ ఫేమ్ బాబీ డియోల్ నటిస్తున్నారు.

Read Also : Supreme Court : సుప్రీంకోర్టు ఎదుట హాజరైన 18 రాష్ట్రాల సీఎస్‌లు.. ఎందుకంటే.. ?