Site icon HashtagU Telugu

NTR Devara : దేవర టార్గెట్ కూడా అదేనా..?

Is NTR Triple Role in Devara

Is NTR Triple Role in Devara

NTR Devara యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా దేవర. యువ సుధ ఆర్ట్స్, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అసలైతే ఏప్రిల్ లోనే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా అక్టోబర్ కి వాయిదా వేశారు. ఐతే ఈలోగా సెప్టెంబర్ 27 స్లాట్ ఖాళీ అవ్వడంతో ఆ డేట్ రిలీజ్ ఫిక్స్ చేశారు. దసరాకి రెండు వారాల ముందే ప్రేక్షకుల ముందుకు వస్తున్న దేవర సినిమాపై అంచనాలు మాత్రం తారాస్థాయిలో ఉన్నాయి.

ఈ సినిమా విషయంలో ఎన్.టి.ఆర్ ఒక హీరోగానే కాదు అన్ని విధాలుగా కృషి చేస్తున్నాడని తెలుస్తుంది. ఆచార్య లాంటి ఫ్లాప్ పడ్డాక కూడా కొరటాల శివ మీద ఉన్న నమ్మకంతో తారక్ ఈ సినిమా చేస్తున్నాడు. ఐతే దేవర సినిమాతో ఎన్.టి.ఆర్ భారీ టార్గెట్ నే పెట్టుకున్నాడు. ఆర్.ఆర్.ఆర్ లో చరణ్ తో కలిసి నటించి సినిమాను సెన్సేషనల్ హిట్ అందుకున్న ఎన్.టి.ఆర్ ఆ సినిమాతో 1000 కోట్ల మార్కెట్ రీచ్ అయ్యారు.

ఇప్పుడు దేవరతో సోలోగా ఆ మార్క్ చేరుకోవాలని చూస్తున్నాడు ఎన్.టి.ఆర్. అందుకే దేవర విషయంలో ఏమాత్రం అంచనాలు తప్పకుండా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నారట. ఎన్.టి.ఆర్ కూడా అభిమానులంతా కాలర్ ఎగరేసేలా సినిమా ఉంటుందని చెప్పడంతో దేవర కచ్చితంగా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Also Read : Manchu Vishnu : కల్కిని చూశావా కన్నప్పా..?