Site icon HashtagU Telugu

NTR Devara Prepone : దేవర ముందుకు వస్తుందా.. ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఏంటంటే..!

Is NTR Triple Role in Devara

Is NTR Triple Role in Devara

NTR Devara Prepone యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా దేవర. యువ సుధ ఆర్ట్స్, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిసుతంది. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 10న రిలీజ్ లాక్ చేశారు. దేవర ముందు ఒక సినిమాగా తీయాలని అనుకున్నా సినిమా అవుట్ పుట్ బాగా వస్తుండటం సినిమాను పొడిగించే అవకాశం ఉండటంతో దేవరని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు.

దేవర సినిమా అక్టోబర్ 11న రిలీజ్ లాక్ చేయగా ఇప్పుడు ఆ టైం కు వస్తుందా రాదా అన్న డౌట్లు మొదలయ్యాయి. అక్టోబర్ 11న దసరా కానుకగా దేవర 1 తీసుకు రావాలని అనుకున్నారు. కానీ సినిమాని ఇంకా ముందుగానే తెచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. సెప్టెంబర్ 27న దేవర సినిమా రిలీజ్ లాక్ చేస్తున్నారని తెలుస్తుంది.

ఐతే ఆ డేట్ న పవర్ స్టర్ పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్ లాక్ చేశారు. ఓజీ వాయిదా పడుతుందని ఆ టైం కు దేవరని రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారట. సెప్టంబర్ 27న రావాల్సిన ఓజీ డిసెంబర్ కి వేళ్తుందని టాక్. ఇక దసరాకి రాం చరణ్ గేం చేంజర్ రాబోతుందని అంటున్నారు. సో ఇలా స్టార్ సినిమాలు ఒక దాని రిలీజ్ డేట్ కి మరోటి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. దేవర ముందుకు వస్తే మాత్రం ఫ్యాన్స్ పండుగ చేసుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.