Site icon HashtagU Telugu

Devara Pre Release Event : ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆ ముగ్గురు స్టార్ డైరెక్టర్స్..

NTR Devara Pre Release Event Details and Guest Talk

Devara Ntr

Devara Pre Release Event : ఎన్టీఆర్ దేవర సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేయడంతో సినిమాపై మరింత హైప్ నెలకొంది. అయితే అన్ని భాషల్లో ప్రమోషన్స్ చేస్తున్నప్పటికీ తెలుగులో మాత్రం ఫ్యాన్స్ కోసం ఒక్కటే స్పెషల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టనున్నారు.

తాజాగా ఎన్టీఆర్ దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 22న ఉండబోతున్నట్టు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. అయితే ప్లేస్ మాత్రం ఎక్కడో ఇంకా చెప్పలేదు. రామోజీ ఫిలిం సిటీ లేదా నోవాటెల్ లో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండొచ్చు అని భావిస్తున్నారు. ఇన్ని రోజులు ఈ ఈవెంట్ కి మహేష్ బాబు గెస్ట్ గా వస్తారని టాక్ వినిపించింది. కానీ తాజాగా ముగ్గురు స్టార్ డైరెక్టర్స్ పేర్లు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ దేవర సినిమాకి ఎన్టీఆర్ తో ఆల్రెడీ పనిచేసిన రాజమౌళి, త్రివిక్రమ్, ఎన్టీఆర్ తో వర్క్ చేయబోయే ప్రశాంత్ నీల్.. ఈ ముగ్గురు డైరెక్టర్స్ గెస్ట్ గా వస్తారని టాలీవుడ్ టాక్. ఇదే నిజమైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఈ ముగ్గురు డైరెక్టర్స్ ఎన్టీఆర్ గురించి ఏ రేంజ్ లో చెప్తారో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఆల్మోస్ట్ 6 ఏళ్ళ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా రావడం, ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడుతుండటంతో ఈ ఈవెంట్ పై కూడా ఫ్యాన్స్ అంచనాలు పెంచుకుంటున్నారు.

 

Also Read : Pawan Kalyan : పవన్‌ని కలిసిన హరిహర వీరమల్లు మూవీ టీమ్.. షూటికి రెడీ అవుతున్న డిప్యూటీ సీఎం..