Site icon HashtagU Telugu

Devara – Kalki : తెలుగు రాష్ట్రాల్లో దేవర, కల్కి.. థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్‌లో..

Ntr Devara Prabhas Kalki 2898 Ad Theatrical Rights Business

Ntr Devara Prabhas Kalki 2898 Ad Theatrical Rights Business

Devara – Kalki : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ హైపెడ్ మూవీస్ ప్రభాస్ ‘కల్కి’, ఎన్టీఆర్ ‘దేవర’. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న కల్కి.. సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. ఇక కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న దేవర.. పూర్తి యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతుంది. ఈ రెండు చిత్రాల పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ హైప్ తో ఈ మూవీ థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ ఓ రేంజ్ లో పలుకుతున్నాయి.

కల్కి సినిమా భారీ స్టార్ కాస్టింగ్ తో హాలీవుడ్ స్థాయిలో ఆడియన్స్ ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీ కేవలం కొన్ని ఏరియాలోనే 100 కోట్ల బిజినెస్ పలుకుతుంది. ఇక ఈ క్రేజ్ తోనే ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ ని 100 కోట్లకు కోట్ చేస్తున్నారట. మరి ఫైనల్ గా ఈ రేటు ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. ఇక ఒక్క ఆంధ్ర ఏరియానే ఇలా ఉందంటే.. నైజం, నార్త్, సౌత్ లోని ఇతర రాష్ట్రాలు కలుపుకొని ఈ మూవీ 500 కోట్ల పైనే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇక దేవర విషయానికి వస్తే.. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకోవడం కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో గట్టి పోటీ కనిపిస్తుంది. ఇక ఈ పోటీతో రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 130 కోట్ల వరకు కోట్ చేస్తున్నారని ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రేటు కూడా పెరిగే అవకాశం ఉంది.

కాగా దేవర మూవీ నార్త్ థియేట్రికల్ రైట్స్ ని కరణ్ జోహార్ భారీ ధరకు సొంతం చేసుకున్నారట. గతంలో ఈ నిర్మాత బాహుబలి సినిమాని నార్త్ లో భారీ ఎత్తున రిలీజ్ చేసి భారీ లాభాలను అందుకున్నారు. ఇప్పుడు దేవరని కూడా బాహుబలి స్థాయిలో రిలీజ్ చేసే అవకాశం ఉంది. మరి దేవరతో నార్త్ లో ఎన్టీఆర్ ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తారో చూడాలి.

Also read : Prabhas Kalki : కల్కి రిలీజ్.. ఇంత ఊగిసలాట ఎందుకు..?