Site icon HashtagU Telugu

Pooja Hegde : దేవర ఐటం సాంగ్ తో ఊపు ఊపేందుకు సిద్ధమైన అమ్మడు..!

Pooja Hegde Bad Luck Continues

Pooja Hegde Bad Luck Continues

Pooja Hegde ఎన్.టి.ఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా దేవర. యువసుధ ప్రొడక్షన్స్, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న దేవర రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే. దేవర మొదటి పార్ట్ అక్టోబర్ 10న రిలీజ్ లాక్ చేశారు. దసరా కానుకగా దేవర దమ్ము చూపించేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ అందాల భామ శ్రీదేవి తనయురాలు జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుందని తెలిసినే.

సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందిస్తుండగా సాంగ్స్ పరంగా కూడా దేవర నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెబుతున్నారు. దేవర 1 లో స్పెషల్ ఐటం సాంగ్ ఉండబోతుందని టాక్. ఈ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్ ని రంగంలోకి దించుతున్నారని తెలుస్తుంది. దేవర స్పెషల్ సాంగ్ లో ఎవరెవరి పేర్లో చర్చలు రాగా ఫైనల్ గా బుట్ట బొమ్మ పూజా హెగ్దే పేరుని ఫైనల్ చేశారని తెలుస్తుంది.

ఎన్.టి.ఆర్ తో ఆల్రెడీ అరవింద సమేత సినిమా చేసిన పూజా హెగ్దే మళ్లీ దేవర కోసం ఎన్.టి.ఆర్ తో కలిసి స్పెషల్ సాంగ్ చేయనుంది. పూజా హెగ్దే రంగస్థలం సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. సినిమాకు ఆ సాంగ్ అంతగా హెల్ప్ అవ్వకపోయినా స్పెషల్ సాంగ్ తో పూజా మెప్పించింది.

తెలుగులో ఛాన్సులు లేక ఖాళీగా ఉన్న పూజా హెగ్దేకి దేవర ఛాన్స్ నిజమైతే మాత్రం కచ్చితంగా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు. దేవర లో పూజా బేబి సాంగ్ ఉంటుందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.