Site icon HashtagU Telugu

Devara : అక్టోబర్ కాదు సెప్టెంబర్‌లోనే రాబోతున్న దేవర.. నిజమేనా..?

Ntr Devara Part 1 Is Preponed To September From October

Ntr Devara Part 1 Is Preponed To September From October

Devara : కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘దేవర’. కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కుతుంది. కాగా ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ని ఏప్రిల్ నెలలోనే రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ముందుగా ప్రకటించారు. కానీ సినిమా షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉండడంతో మూవీని అక్టోబర్ కి పోస్టుపోన్ చేశారు. దసరా సమయంలో వచ్చి బ్లాక్ బస్టర్ ని అందుకోవాలని మేకర్స్ అక్టోబర్ 10ని ఫిక్స్ చేసుకున్నారు.

అయితే ఇప్పుడు ఆ డేట్ కి కాకుండా ఒక నెల ముందే ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు దేవర సిద్దమవుతున్నాడట. సెప్టెంబర్ లో పవన్ కళ్యాణ్ ‘ఓజి’ సినిమా రిలీజ్ చేసేందుకు డివివి దానయ్య డేట్ ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సమయానికి ఓజి రిలీజ్ అవ్వడం కష్టమని తెలుస్తుంది. దీంతో ఆ తేదీకి తమ సినిమాని తీసుకు రావాలని కొందరు మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారు. ఈక్రమంలోనే దేవర మూవీ టీం కూడా ఆ తేదీ వైపు చూస్తున్నట్లు సమాచారం.

సెప్టెంబర్ నాటికీ దేవర పార్ట్ 1 పనులు అన్ని పూర్తి అయ్యిపోతాయి. దీంతో సెప్టెంబర్ లోనే దేవరనే తీసుకు వచ్చేస్తే బెటర్ అని ఆలోచిస్తున్నారట. ఎందుకంటే.. దసరా సమయంలో మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. సెప్టెంబర్ లో అయితే సింగల్ రిలీజ్ ఉంటుంది. దీంతో మూవీ కలెక్షన్స్ విషయంలో సెప్టెంబర్ రిలీజ్ దేవరకి కలిసొస్తుంది. అయితే దేవరని ముందుకు తీసుకు రావాలంటే.. ఓజి పోస్టుపోన్ విషయంలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

కాగా ఈ మూవీలో జాన్వీకపూర్ (Janvi kapoor), మ‌రాఠీ భామ శృతి మరాటే హీరోయిన్లుగా నటిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ విల‌న్‌గా కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్.. పాడేరు మాడుగుల ఘాట్ రోడ్డు లో జరుగుతోంది. ఎన్టీఆర్ లేకుండా, ఓన్లీ కొన్ని బ్లాస్ట్ సీన్ లు చిత్రీకరిస్తున్నారు.