Site icon HashtagU Telugu

NTR Devara : ఎన్టీఆర్ దేవర ఓటీటీ రిలీజ్ డేట్ లాక్..?

NTR Wrote Special Letter on Devara Movie Success

Ntr Devara

యంగ్ టైగర్ మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) లేటెస్ట్ సెన్సేషన్ దేవర సినిమా థియేట్రికల్ రిలీజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన దేవర సినిమాను యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మించాయి. సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించగా అనిరుద్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు.

దేవర (Devara) రిలీజ్ డే నాడు టాక్ బాగాలేకపోయినా తర్వాత తర్వాత సినిమా పుంజుకుంది. వసూళ్లలో 500 కోట్ల గ్రాస్ మార్క్ దాటిన దేవర మరోసారి బాక్సాఫీస్ దగ్గర ఎన్టీఆర్ స్టామినా ఏంటో చూపించింది. ఐతే దేవర థియేట్రికల్ రన్ దాదాపు ముగిసింది. సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.

నవంబర్ మొదటి వారం ఓటీటీ రిలీజ్..

నెట్ ఫ్లిక్స్ (Netflix) దేవర ఓటీటీ హక్కులు దక్కించుకుంది. ఐతే తెలుస్తున్న సమాచారం ప్రకారం నవంబర్ మొదటి వారం అంటే నవంబర్ 7న ఎన్టీఆర్ దేవర ఓటీటీ రిలీజ్ అవుతుందని అంటున్నారు. దేవర సినిమాలో తారక్ యాక్షన్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. సినిమా ఓటీటీ రిలీజ్ తర్వాత డిజిటల్ ఆడియన్స్ ను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.

దేవర 1 సెప్టెంబర్ 27న రిలీజైంది. దేవర 2 కోసం రెండేళ్ల పాటు వెయిట్ చేయాల్సిందే. మరి దేవర ఓటీటీ స్ట్రీమింగ్ లో కూడా రికార్డులు కొల్లగొడుతుందా లేదా అన్నది చూడాలి. దేవర ఓటీటీ రిలీజ్ పై పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ వెయిటింగ్ లో ఉన్నారు. థియేట్రికల్ రన్ కనా ఎక్కువగా ఓటీటీ రిలీజ్ తర్వాత బజ్ క్రియేట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.

Also Read : BiggBoss 8 : బిగ్ బాస్ 8లో సెల్ఫ్ ఎలిమినేషన్.. రీజన్స్ ఇవేనా..!