Site icon HashtagU Telugu

NTR Devara : దేవర OTT డీల్ క్లోజ్.. డిజిటల్ రైట్స్ లో దుమ్ము దులిపేస్తున్న ఎన్.టి.ఆర్..!

Is NTR Devara Release Planing to Postpone

Is NTR Devara Release Planing to Postpone

NTR Devara యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర మొదటి పార్ట్ ఈ ఏప్రిల్ లో రిలీజ్ అవుతుంది. ఏప్రిల్ 5న దేవర మొదటి పార్ట్ వస్తుంది. ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ వీర లెవెల్ లో ఉంది. ఈమధ్యనే వచ్చిన సినిమా ఫస్ట్ లుక్ టీజర్ అంచనాలు పెంచగా ఈసారి కొరటాల శివ తనలోని ఊర మాస్ యాంగిల్ ని చూపించడానికి రెడీ అవుతున్నాడు. సెట్స్ మీద ఉన్నప్పుడే దేవర మీద భారీ హైప్ తెస్తున్నారు. సినిమా బిజినెస్ లో కూడా దూకుడు చూపిస్తున్నారు.

We’re now on WhatsApp : Click to Join

దేవర సినిమా ఓటీటీ రైట్స్ డీల్ క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. సినిమాను నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు డిజిటల్ రైట్స్ కొనేసిందట. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఎన్.టి.ఆర్ దేవర ఓటీటీ రైట్స్ ని 155 కోట్లకు కొనేశారట. నెట్ ఫ్లిక్స్ లో రాబోతున్న తెలుగు భారీ సినిమాల్లో దేవర కూడా ఒకటని చెప్పొచ్చు. దేవర సినిమా అన్ని భాషల డిజిటల్ రైట్స్ ని 155 కోట్లకు డీల్ సెట్ చేసుకున్నారు నెట్ ఫ్లిక్స్.

డిజిటల్ రైట్స్ కే ఆ రేంజ్ బిజినెస్ అంటే కచ్చితంగా దేవర థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగానే చేస్తుందని చెప్పొచ్చు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ చేస్తున్న సినిమాగా దేవర మీద ఎక్కడలేని అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆచార్యతో ఫ్లాప్ అందుకున్న కొరటాల శివ మీద తారక్ ఫ్యాన్స్ డౌట్ పడుతున్నా ఎన్.టి.ఆర్ మాత్రం స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకంతో ముందుకెళ్తున్నాడు. ముందు దేవర ను ఒక పార్ట్ గా చేయాలని అనుకున్నా సినిమా వస్తున్న అవుట్ పుట్ చూసి రెండు భాగాలుగా చేస్తున్నారు.

దేవర 1 ఏప్రిల్ 5న ఆడియన్స్ ముందుకు వస్తుంది. ఈ సినిమాతో ఎన్.టి.ఆర్ భారీ స్కెచ్ వేశాడని చెప్పొచ్చు. ఎన్.టి.ఆర్ దేవర సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాను అన్ని విధాలుగా ది బెస్ట్ అనిపించేలా ప్లాన్ చేస్తున్నారట.

Also Read : Ram – Puri Jagannath డబుల్ ఇస్మార్ట్ ఆ డేట్ కష్టమేనా..?

దేవర తో తారక్ మరోసారి గ్లోబల్ రేంజ్ లో తన సత్తా చాటాలని చూస్తున్నారు. మరి ఆ విషయంలో సినిమా ఏ రేంజ్ సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. ఈసారి ఎన్.టి.ఆర్ రికార్డుల ఊచకోత చేస్తాడని తారక్ ఫ్యాన్స్ అంతా ఫిక్స్ అయ్యారు. మరి ఈ సినిమా ఆ రేంజ్ అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.

Exit mobile version