Site icon HashtagU Telugu

NTR Devara : దేవర డీల్ సెట్ అయ్యిందా..?

Ntr Devara Non Theatrical B

Ntr Devara Non Theatrical B

RRR తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ (NTR Devara ) చేస్తున్న దేవర సినిమా మీద అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేస్తున్నాడు. సినిమాలో తారక్ ఫ్యాన్స్ కోరుకునే ఎన్నో హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ ఉన్నాయని తెలుస్తుంది.

సెట్స్ మీద ఉండగానే దేవరకు కళ్లు చెదిరే డీల్స్ వస్తున్నాయని తెలుస్తుంది. సినిమాను 2024 ఏప్రిల్ 5న రిలీజ్ ఫిక్స్ చేయగా ఇప్పటికే నాన్ థియేట్రికల్ రైట్స్ రూపం లో ఫ్యాన్సీ ఆఫర్స్ వస్తున్నాయట. తెలుస్తున్న సమాచారం ప్రకారం దేవర సినిమాకు డిజిటల్, శాటిలైట్, ఆడియో రైట్స్ రూపం లో 140 కోట్ల దాకా డీల్ వచ్చినట్టు టాక్. అయితే మేకర్స్ ఈ రేటు ఇంకా పెరుగుతుందనే ఆలోచనతో ప్రస్తుతానికి ఆఫర్ ని హోల్డ్ లో పెట్టారట.

దేవర సినిమా విషయంలో ఎన్.టి.ఆర్ (NTR Devara ) ప్లానింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. సినిమా కోసం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తారక్ కొరటాల శివ ఇద్దరు తమ బెస్ట్ వర్క్ అందిస్తున్నారని తెలుస్తుంది. సినిమాలో ఎన్.టి.ఆర్ ఉగ్రరూపం బాక్సాఫీస్ పై పులి పంజా విసిరేలా చేస్తుందని అంటున్నారు. దర్శక నిర్మాతలు ఈ సినిమా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తున్నారని తెలుస్తుంది.

సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ కూడా మరో హైలెట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే కోలీవుడ్ లో తన మ్యూజిక్ తో రికార్డులు కొడుతున్న అనిరుద్ ఎన్.టి.ఆర్ దేవర కోసం దుమ్ము దులిపేసే మ్యూజిక్ అందిస్తాడని అంటున్నారు.

Also Read : Nitya Menon : కుమారి శ్రీమతి టీజర్ చూశారా..!