టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మొదలైన పోస్టర్లు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే హీరో నాగ చైతన్య విషయానికి వస్తే.. చైతన్య ప్రస్తుతం తండేల్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికీ ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లో ఈ సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఈ సినిమాపై కూడా భారీగా అంచనాలు పెట్టుకున్నారు అక్కినేని అభిమానులు. ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ నటిస్తున్న దేవర,చైతన్య నటిస్తున్న తండేల్ సినిమాలు ఇద్దరి కెరియర్ లో కూడా బిగ్గెస్ట్ ప్రాజెక్టులుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ రెండు చిత్రాల్లో ఎన్టీఆర్ దేవర ఏప్రిల్ నెలలోనే రావాల్సి ఉంది. కానీ వర్క్ పూర్తి కాకపోవడంతో వాయిదా పడాల్సి వచ్చింది. ఇక ఈ పోస్టుపోన్‌తో రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకోవడానికి దేవర టీం బాగా కష్టపడింది. మే నెలలో ప్రభాస్ కల్కి ఆగష్టులో అల్లు అర్జున్ పుష్ప 2 ఉండడంతో రిలీజ్ ని దసరా పండక్కి ప్లాన్ చేయాల్సి వచ్చింది.
దేవర 1ని అక్టోబర్ 10న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా నాగచైతన్య కూడా అదే సమయంలో రావడానికి సిద్దమవుతున్నట్లు ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న తండేల్ దసరాకి రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారట. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద దేవర వెర్సస్ తండేల్ పోటీ కనిపించే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ రెండు చిత్రాలు సముద్రం బ్యాక్‌డ్రాప్ తోనే వస్తున్నాయి. మరి తండేల్, దేవరతో పోటీకి దిగుతుందా? లేదా వెనక్కి తగ్గుతుందా? అనేది చూడాలి మరి. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొందరు నెటిజన్స్ అభిమానులు స్పందిస్తూ ఈ రెండిట్లో దేవర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయం అంటూ కామెంట్లు చేస్తున్నారు.