Devara Trailer : ఎన్టీఆర్(NTR) దేవర సినిమా కోసం ఫ్యాన్స్, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచగా తాజాగా మరో ట్రైలర్ రిలీజ్ చేసారు. దేవర రిలీజ్ కి మరో అయిదు రోజులు సమయం ఉండగా నేడు రిలీజ్ ట్రైలర్ విడుదల చేసారు. ఈ ట్రైలర్ లో సముద్రంలో మాస్ యాక్షన్ సీక్వెన్స్ లు, ఎన్టీఆర్ డబల్ రోల్ పర్ఫార్మెన్స్, సైఫ్ అలీఖాన్ విలనిజం.. ఇలా అన్ని చూపించారు.
మీరు కూడా దేవర కొత్త ట్రైలర్ చూసేయండి..
ఇక నేడు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరుగనుంది. ఫ్యాన్స్ ఈ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇవాళ ఎన్టీఆర్ ఏం మాట్లాడతాడో అని ఎదురుచూస్తున్నారు. మూవీ యూనిట్ తెలుగులో ఇప్పటివరకు సోషల్ మీడియా ప్రమోషన్స్ తప్ప మీడియా ముందుకు రాలేదు. దేవర ప్రమోషన్స్ లో మీడియా, ఫ్యాన్స్ ముందుకు మొదటిసారి ఎన్టీఆర్ వస్తుండటంతో ఈ ఈవెంట్ పై కూడా మంచి హైప్ నెలకొంది.
Also Read : Tirumala laddu issue: నన్ను మన్నించు స్వామీ.. పవన్ ప్రాయశ్చిత్త నిరాహార దీక్ష ప్రారంభం