ఎన్టీఆర్ దేవర సినిమా ఈ ఇయర్ సెప్టెంబర్ ఎండ్ లో రిలీజై సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేయగా రెండో భాగం ఎప్పుడనది తెలియాల్సి ఉంది. ఐతే NTR దేవర సినిమా జపాన్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇండియన్ సినిమాలు ఈమధ్య జపాన్ (Japan) లో సంచలన విజయాలు అందుకుంటున్నాయి. వీటిలో భాగంగానే అక్కడ మన సినిమాలు భారీగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
తెలుగు కల్కి సినిమా త్వరలోనే రిలీజ్ చేస్తున్నారు. ఇక మార్చి లో జపాన్ లో దేవర రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. RRR జపాన్ రిలీజ్ టైం లో ఎన్టీఆర్, చరణ్ ఇద్దరు కలిసి ప్రమోట్ చేశారు. ఇక ఇప్పుడు దేవర (Devara) సినిమాకు ఎన్టీఆర్ అక్కడకి వెళ్తాడా లేదా అన్నది చూడాలి. ఈమధ్యనే సౌత్ నుంచి విజయ్ సేతుపతి మహారాజ సినిమా జపాన్ లో రిలీజ్ చేశారు.
ఆ సినిమాకు అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక దేవర సినిమాకు జపాన్ లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూతున్నారు. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన దేవర సినిమాలో ఎన్ టీ ఆర్ డ్యుయల్ రోల్ చేశాడు. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించింది. సినిమాకు అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చింది. మరి ఈ సినిమా జపాన్ రిలీజ్ ఎలాంటి హంగామా చేస్తుందో చూడాలి.