ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్ మెంట్ అందించేందుకు భారీ బడ్జెట్ తో స్టార్ సినిమాలతో పాటు మీడియం బడ్జెట్ తో కమర్షియల్ అంశాలున్న సినిమాలు అందిస్తుంటారు. అవి కాకపోతే కంటెంట్ ఉన్న సినిమాలు లో బడ్జెట్ తో వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే థియేటర్ కి ప్రేక్షకులు వచ్చి సినిమాలు చూస్తున్నారు. రీసెంట్ గా సరిపోదా శనివారం సక్సెస్ మీడియం రేంజ్ హీరోలకు మంచి జోష్ ఇచ్చింది. నాని వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన సరిపోదా శనివారం కమర్షియల్ సక్సెస్ తో దూసుకెళ్తుంది.
ఐతే ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయితే సినిమా ఇప్పుడప్పుడే OTTలోకి రాదని అనుకున్నారు. కానీ నాని (Nani) సరిపోదా శనివారం సెప్టెంబర్ 27న రిలీజ్ ఓకే చేసినట్టు తెలుస్తుంది. నాని సూపర్ హిట్ సినిమా నెల లోగా థియేటర్ లో ఎందుకు అంటే నిర్మాతలు ఓటీటీ సంస్థల మధ్య ఒప్పందం ప్రకారం అలా చేస్తున్నారని తెలుస్తుంది.
నాని కెరీర్ లో ప్రత్యేకమైన సినిమాగా సరిపోదా శనివారం వచ్చింది. ఐతే సెప్టెంపర్ 27 అంటే ఆరోజు థియేటర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) దేవర (Devara) రిలీజ్ అవుతుంది. తారక్ సినిమా థియేటర్ లో సందడి చేస్తుంటే ఓటీటీలో నాని సరిపోదా శనివారం హంగామా చేస్తుంది. ఇలా ఒక క్రేజీ మూవీ థియేటర్ లో, ఓటీటీల కాంబోలో రిలీజ్ అవ్వడం సినీ ప్రియులను అలరిస్తుంది. సరిపోదా ఓటీటీ రైట్స్ కూడా రికార్డ్ స్థాయిలో జరిగినట్టు తెలుస్తుంది. నాని కెరీర్ లో ఈ సినిమా మరో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచేలా ఛాన్సులు కనిపిస్తున్నాయి. దేవర విషయానికి వస్తే తారక్ బాక్సాఫీస్ స్టామినా ఏంటన్నది పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా రాబోతుంది.