ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ దేవర. ఈ సినిమాకు సంబందించిన పార్ట్ 1 శుక్రవారం రిలీజైంది. ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ గా చేసిన ఈ సినిమా ఫ్యాన్స్ ను సాటిస్ఫై చేసిన కామన్ ఆడియన్స్ ను మాత్రం నిరాశపరచింది.
దేవర ప్రీమియర్ షో నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయినా సరే సినిమా వసూళ్ల మీద ఏమాత్రం ఎఫెక్ట్ పడలేదు. దేవర సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇంతకీ దేవర ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే తెలుగు రెండు రాష్ట్రాల వరకు 54.21 కోట్లు అని తెలుస్తుంది.
రెండు రాష్ట్రాల్లో సెకండ్ హైయెస్ట్ షేర్..
తెలుగు రెండు రాష్ట్రాల్లో సెకండ్ హైయెస్ట్ షేర్ ని దేవర రాబట్టింది. నైజాం లో 19.32 కోట్లు, ఉత్తరాంధ్ర 5.47 కోట్లు, గుంటూరు 6.27 కోట్లు, నెల్లూరు 2.11 కోట్లు, కృష్ణా 3.2 కోట్లు, ఈస్ట్ వెస్ట్ 4.02 కోట్లు, వెస్ట్ 3.60 కోట్లు షేర్ రాబట్టింది. సీడెడ్ లో 10.40 కోట్లు రాబట్టినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా దేవర ఫస్ట్ డే తెలుగు రెండు రాష్ట్రాల్లో 54.21 కోట్లు రాబట్టింది.
దేవర సినిమా ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్ గా అనిపించినా సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ అయినట్టు ఆడియన్స్ భావిస్తున్నారు. దేవర సినిమా విషయంలో ఫ్యాన్స్ సంతృప్తి కరంగా ఉన్నా కామన్ ఆడియన్స్ ను మాత్రం కాస్త అసంతృప్తిగా ఉన్నారు. దేవరలో ఎన్టీఆర్ సరసన్స జాన్వి కపూర్ నటించింది. అయితే ఆమె స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఉండటం ఆశ్చర్యపరచింది. సైఫ్ అలీ ఖాన్ విలనిజం ఫ్యాన్స్ ని మెప్పించింది.
Also Read : Hurricane Helene : హెలెనా హరికేన్ బీభత్సం.. అమెరికాలో 44 మంది మృతి