Site icon HashtagU Telugu

Devara OTT : దేవర అప్పుడే OTTలోకి వచ్చేస్తుందా..?

Devara Ayudapooja Song

Devara Ayudapooja Song

Devara OTT ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ దేవర సెప్టెంబర్ 27న రిలీజై టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లను రాబడుతుంది. ఇప్పటికే 460 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసిన దేవర సినిమా ఫుల్ రన్ లో 500 కోట్లు పైన రాబట్టేలా ఉంది. దేవర సినిమా థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ మిస్ అయిన వారు ఓటీటీలో చూడాలని ఆసక్తిగా ఉన్నారు. అందుకే దేవర ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ (Netflix) దేవర డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకుంది. భారీ మొత్తంగానే దేవర హక్కులను పొందినట్టు తెలుస్తుంది.

దేవర (Devara) సినిమాను ఫెస్టివల్ కి ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఐతే దసరా టైం లో థియేటర్ లో దేవరకు కలిసి వచ్చేలా ఉండగా మంత్ ఎండింగ్ కల్లా దేవర బాక్సాఫీస్ రన్ ముగిసేలా ఉంది. అందుకే సినిమాను అక్టోబర్ 31న డిజిటల్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దేవర సినిమా ఓటీటీ రిలీజైతే అక్కడ కూడా రికార్డులు కొల్లగొడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అనిరుద్ అందించిన మ్యూజిక్ హైలెట్..

దేవర సినిమాకు అనిరుద్ అందించిన మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ ఒక లెవెల్ కాగా అనిరుద్ మ్యూజిక్ దాన్ని వేరే లెవెల్ కి తీసుకెళ్లింది. దేవర సినిమా పార్ట్ 1 రిజల్ట్ తేలిపోగా ఆడియన్స్ అంతా ఇప్పుడు పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్నారు. దేవర 1 లో సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నలకు దేవర 2 లో ఆన్సర్స్ దొరుకుతాయని తెలుస్తుంది.

దేవర సినిమాతో ఎన్టీఆర్ (NTR) మాస్ స్టామినా ఏంటన్నది మరోసారి ప్రూవ్ అయ్యింది. సినిమా రిలీజ్ నాడు ఉన్న టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు అదిరిపోయాయి. దేవర 1 పూర్తి చేసిన తార్క్ ప్రస్తుతం వార్ 2 షూట్ లో పాల్గొంటున్నాడు.

Also Read : Varun Tej Matka : మట్కా కోసం పూర్ణా మార్కెట్ సెట్.. మేకింగ్ వీడియో..!