ఎన్టీఆర్ (NTR) కొరటాల శివ (Koratala Siva) కాంబోలో వచ్చిన దేవర 1 సినిమా సెప్టెంబర్ 27న రిలీజై మంచి వసూళ్లను రాబట్టింది. సినిమాకు మిడ్ నైట్ షోస్ వేయగా అప్పటి నుంచే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. అయితే ఎన్ టీ ఆర్ ఫ్యాన్స్ ఈ సినిమాను తమ భుజాన వేసుకుని హిట్ చేశారు. దేవర 1 లో దేవర, వర రెండు పాత్రల్లో తారక్ అలరించాడు. జాన్వి కపూర్ అందాలతో పాటు అనిరుద్ మ్యూజిక్ సినిమాకు హెల్ప్ అయ్యాయి. ఐతే దేవర 1 ఎలాగోలా గట్టేక్కేసింది. దేవర 2 పరిస్థితి ఏంటన్నది తెలియాల్సి ఉంది.
రీసెంట్ గా దేవర 1 సినిమా ఓటీటీ రిలీజైంది. ఈ సినిమా ఓటీటీలో చూసిన వారు సోషల్ మీడియాలో మరింత ట్రోల్ చేస్తున్నారు. సినిమాను థియేటర్ లో సక్సెస్ చేసిన ఫ్యాన్స్ ఓటీటీ విషయంలో ఏమీ చేయలేకపోతున్నారు. ఐతే ఈ టైం లో దేవర 2 సినిమా ఉంటుందా అసలు చేస్తే ఎలా ఉంటుంది అన్న చర్చ మొదలైంది.
దేవర చనిపోవడం..
దేవర 1 ని సస్పెన్స్ లో ముగించాలని దేవర చనిపోవడం తో ఎండ్ కార్డ్ వేసి పార్ట్ 2 ని అనౌన్స్ చేశారు. ఐతే దేవర పార్ట్ 2 కథ చాలా తక్కువగానే ఉంటుంది. దీన్ని రెండున్నర గంటల దాకా నడిపించడం కష్టం. అదీగాక దేవర 1 సినిమా యునానిమస్ హిట్ టాక్ తెచ్చుకోలేదు. సినిమాకు వసూళ్లు వచ్చినా కొంతమంది ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తపరిచారు.
ఇప్పుడు దేవర 2 (Devara 2) వచ్చినా వాళ్లు కూడా చేతులెత్తేసేలా ఉన్నారు. మరి ఇలాంటి టైం లో దేవర 2 చేస్తారా లేదా ఆ ప్రయత్నాన్న్ని ఆపేస్తారా అన్నది చూడాలి. ఈమధ్య కొన్ని సినిమాలు పార్ట్ 1 సక్సెస్ అయితేనే రెండో పార్ట్ చేస్తున్నారు. మరి దేవర 2 ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.