యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) RRR తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ లో మిక్కిలినేని సుధాకర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తో పాటుగా బాలీవుడ్ మూవీ వార్ 2 లో కూడా తారక్ నటిస్తున్నాడు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరు కలిసి వార్ 2 లో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. వార్ 2 సినిమా కోసం 2024 జనవరి నుంచి ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
వార్ 2 ని అయాన్ ముఖర్జీ (Ayan Mukharjee) డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను యశ్ రాజ్ ఫిలిమ్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్స్ మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది తెలియాల్సి ఉంది. ఓ పక్క దేవరతో నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లో బాక్సాఫీస్ షేక్ చేయనున్న ఎన్టీఆర్ వార్ 2తో మరో బీభత్సానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను 2025 రిపబ్లిక్ డే కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.
Also Read : Rajinikanth : రజిని తర్వాత నా గురువు అతనే..!
ఈ సినిమా లో హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా నటిస్తుండగా తారక్ నెగిటివ్ రోల్ లో నటిస్తాడని తెలుస్తుంది. హృతిక్, ఎన్టీఆర్ ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని అంటున్నారు.
దేవరతో పాటుగా వార్ 2 తో కూడా పాన్ ఇండియా రేంజ్ లో తన స్టామినా ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తో కూడా ఒక సినిమా ఉందని తెలిసిందే. ఆ సినిమా తో రికార్డులన్నీ సరిచేయాలని కూడా ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.
We’re now on WhatsApp : Click to Join