ఎప్పుడు ఎక్కడ చూసిన దేవర మేనియా (Devara Mania) నడుస్తుంది. ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత చాల గ్యాప్ తీసుకొని కొరటాల శివ (Koratala SHiva) డైరెక్షన్లో న్టీఆర్ (NTR) నటించిన మూవీ దేవర (Devara). జాన్వీ కపూర్ హీరోయిన్ గా , సైఫ్ అలీఖాన్ విలన్ గా తెరకెక్కిన ఈ చిత్రం రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ముందుగా ఈ నెల 27 ఫస్ట్ పార్ట్ విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం తాలూకా సాంగ్స్ , టీజర్, ట్రైలర్ , ప్రమోషన్ కార్య క్రమాలు ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు పెంచడమే కాదు సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆతృతను పెంచాయి. ఇక సోషల్ మీడియా లో అయితే చెప్పాల్సిన పనిలేదు. దేవర మేనియా తో అభిమానులు ఊగిపోతున్నారు. ప్రతిది వైరల్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
తాజాగా కుప్పం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. కుప్పం (Kuppam)కు చెందిన పూరీ ఆర్ట్స్ పురుషోత్తం స్థానిక స్కూల్లోని 500 మంది విద్యార్థులతో ఎన్టీఆర్ ముఖచిత్రాన్ని ఆవిష్కరించారు. దీనిని చూసిన దేవర టీమ్ ‘గ్రేట్ జాబ్’ అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. మరోపక్క ఏపీలో టికెట్స్ ధరలను పెంచుకునే అవకాశంతో పాటు బినిఫిట్ షోస్ కు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది చంద్రబాబు సర్కార్.
మల్టీప్లెక్స్ లో ఒక్కో టికెట్ ఫై రూ.135 వరకూ, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ ఒక్కో టికెట్ ఫై రూ.110, లోయర్ క్లాస్ ఒక్కో టికెట్ ఫై రూ.60 వరకూ పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. అలాగే రిలీజ్ రోజున(SEP 27) 12AM నుంచి మొత్తం 6షోలు, 28వ తేదీ నుంచి 9 రోజులపాటు రోజుకు 5షోల ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ పర్మిషన్ తో ఏపీలో దేవర కలెక్షన్లు కుమ్మేయడం గ్యారెంటీ అని అభిమానులు అంచనాలు వేస్తున్నారు.
9. Kuppam
6 days to go…#DevaraCelebrations pic.twitter.com/TjBvZTcM57
— మట్టి తుఫాన్ (@KadapaKing9999) September 21, 2024
Read Also : Onion Juice: జుట్టు సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఉల్లిపాయతో ఇలా చేయండి..!