Devara : ‘దేవర -1 ‘ పూర్తి చేసిన ఎన్టీఆర్

'ఈ ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగింది. సముద్రమంత ప్రేమను, అద్భుతమైన బృందాన్ని మిస్ అవుతా

Published By: HashtagU Telugu Desk
Ntr Devara1

Ntr Devara1

నందమూరి అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీ ‘దేవర’ (Devara). ఎన్టీఆర్ (NTR) తో జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ మూవీ ని తెరకెక్కించిన కొరటాల శివ(Koratala Shiva)..మరోసారి ఎన్టీఆర్ తో దేవర పేరుతో రెండు పార్ట్స్ గా భారీ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది.

ఈ క్రమంలో ‘దేవర-1’ సినిమాలోని తన పాత్ర షూటింగ్ పూర్తయినట్లు ఎన్టీఆర్ తెలిపారు. ఈ సందర్బంగా చివరి షాట్లో డైరెక్టర్తో డిస్కస్ చేస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘ఈ ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగింది. సముద్రమంత ప్రేమను, అద్భుతమైన బృందాన్ని మిస్ అవుతా. సెప్టెంబరు 27న శివ రూపొందించిన ప్రపంచాన్ని అందరితో కలిసి చూసేందుకు వేచిచూస్తున్నా’ అని పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ తోపాటు ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తీర ప్రాంతం కథ నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుంది. కాగా ఈ మూవీ లో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ తో పాటు ‘యానిమల్’ ఫేమ్ బాబీ డియోల్ నటిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన చుట్టమల్లే సాంగ్ దేశం మొత్తం చుట్టేసి ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సాంగ్ లో ఝాన్వి తన అందంతో యూత్ కు కిక్కించింది.

Read Also : Agrigold Scam : ఆగస్టు 23 వరకు జోగి రాజీవ్ రిమాండ్

  Last Updated: 14 Aug 2024, 08:46 AM IST