Site icon HashtagU Telugu

Nandamuri Fan Died: బింబిసార ప్రిరిలీజ్ లో అపశ్రుతి.. నందమూరి అభిమాని మృతి

Bimbisara

Bimbisara

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ అపశ్రుతి చోటుచేసుకుంది. ఏపీలోని వెస్ట్ గోదావరి జిల్లా, పెంటపాడు మండలానికి చెందిన అభిమాని పుట్టా సాయిరామ్‌(సన్నాఫ్‌ రాంబాబు) బింబిసార ప్రిరిలీజ్ ఈవెంట్ కు అటెండ్ అయ్యాడు. అప్పటి వరకు కేరింతలు కొడుతున్న సాయిరామ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఫిట్స్ కారణంగా సాయిరామ్ చనిపోయాడని అభిమాన సంఘాలు పేర్కొంటున్నాయి. అయితే ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్న సాయిరామ్ కుటుంబానికి పెద్ద దిక్కై అండగా నిలుస్తున్నాడు. కుమారుడి మరణంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

ఓ అభిమాని చనిపోవడంతో చిత్ర యూనిట్ సంతాపం వ్యక్తం చేసింది.  మృతి పట్ల `బింబిసార` యూనిట్‌ స్పందించింది. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈవెంట్‌లో దురదృష్ణవశాత్తు అభిమాని మరణించాడనే వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు తెలిపింది. కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తున్నామని, సాయిరామ్‌ కుటుంబాన్ని సాధ్యమైన విధంగా అన్ని రకాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

Exit mobile version