రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ 1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22 రిలీజ్ లాక్ చేసుకుంది. క్రిస్ మస్ రేసులో ఎన్నో సినిమాలు రిలీజ్ అనుకోగా సలార్ ఎంట్రీతో అవన్నీ కూడా తప్పుకోవాల్సి వచ్చింది. సలార్ (Prabhas Salaar) సీజ్ ఫైర్ 1 లో ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ఊహించని ఎన్నో సర్ ప్రైజ్ లు ఉన్నాయని టాక్. ప్రభాస్ సలార్ సినిమా లో నిన్నటిదాకా ప్రభాస్ ఒక్కడే హీరో అనుకున్నారు. కానీ ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోలను కూడా పెట్టాడట.
(Prabhas Salaar) సలార్ సీజ్ ఫైర్ 1 లో ప్రభాస్ తో పాటుగా ఎన్.టి.ఆర్, యశ్ ఇద్దరి హీరోల క్యామియో ఉంటుందని తెలుస్తుంది. ప్రభాస్ సినిమాలో తారక్ అనగానే ఫ్యాన్స్ లో అంచనాలు డబుల్ అయ్యాయి. తన కె.జి.ఎఫ్ హీరో యశ్ ని.. తను నెక్స్ట్ చేస్తున్న సినిమా హీరో ఎన్.టి.ఆర్ ను ప్రభాస్ సలార్ కోసం వాడేస్తున్నాడు ప్రశాంత్ నీల్.
Also Read : Google Vs Satya Nadella : యాపిల్ తో గూగుల్ కుమ్మక్కైంది.. సత్య నాదెళ్ల సంచలన ఆరోపణలు
ప్రభాస్ (Prabhas) సలార్ లో వీళ్లిద్దరు ఉండటం సినిమా రేంజ్ ని తప్పకుండా పెంచుతుందని చెప్పొచ్చు. ఈమధ్య జైలర్ సినిమాలో మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ లు కనిపించి అదరగొట్టారు. ఇప్పుడు సలార్ లో కూడా అలాంటి క్యామియోతో వీళ్లు అలారిస్తారని తెలుస్తుంది.
ప్రభాస్ సలార్ (Salaar) సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. హోంబలె ప్రొడక్షన్స్ బ్యానర్ లో K.G.F టీం అంతా ఈ సినిమాకు పనిచేశారు. సలార్ సీజ్ ఫైర్ ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచగా ప్రభాస్ రేంజ్ ఏంటన్నది మరోసారి ఈ సినిమా ప్రూవ్ చేస్తుందని ఆశిస్తున్నారు రెబల్ ఫ్యాన్స్.
We’re now on WhatsApp. Click to Join