Site icon HashtagU Telugu

NTR 29th Annavery : నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్

Ntr And Kalyan Ram Visited

Ntr And Kalyan Ram Visited

నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 29వ వర్ధంతి (NTR 29th Annavery ) నేడు. ఈ సందర్బంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ (NTR Ghat) వద్ద జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లు నివాళ్లు అర్పించారు. మరికాసేపట్లో నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మంత్రి నారా లోకేశ్ తదితరులు కూడా ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని నివాళి అర్పించనున్నారు. అలాగే, బసవతారకం ఆసుపత్రిలోనూ బాలకృష్ణ నివాళులు అర్పించనున్నారు. అటు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

Local Body Elections 2025 : స్థానిక సంస్థల పోల్స్ ఎప్పుడు ? ఫిబ్రవరి నెలాఖరులోనేనా ?

అలాగే సీఎం చంద్రబాబు సైతం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించారు. ఆయన చేసిన సేవల్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఎన్టీఆర్ ఆశయాలను సాధిద్దామని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘సమాజమే దేవాలయం… ప్రజలే దేవుళ్ళు’ అన్న సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది… నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్. బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది… స్త్రీలకు సాధికారతనిచ్చిన సంస్కర్త… స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆ మహానాయకుని స్మృతికి నివాళులర్పిద్దాం. సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలనతో… “అధికారం అంటే పేదల జీవితాలు మార్చేందుకు వచ్చిన అవకాశం” అని నిరూపించిన మాననీయులు ఎన్టీఆర్ ఆశించిన సమసమాజాన్ని సాధించుకుందాం. ఎన్టీఆర్ ఆశయ సాధనలో అనుక్షణం పనిచేస్తామని… తెలుగు జాతిని నెంబర్ వన్ చేసేందుకు కంకణబద్ధులై ఉన్నామని తెలుపుతూ… ఆ యుగపురుషుని వర్థంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను’ అని పోస్ట్ చేశారు.