Site icon HashtagU Telugu

NTR 30 : అందరు అనుకున్నదే.. NTR 30వ సినిమా ‘దేవర’

NTR 30 Titled as Devara and first look released

NTR 30 Titled as Devara and first look released

RRR సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఎన్టీఆర్(NTR) సినిమా చేస్తున్నాడు. కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ సినిమా భారీగా తెరకెక్కుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయింది.

ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్స్, అప్డేట్స్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెంచారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ మోస్ట్ వయోలెంట్ పాత్ర చేయబోతున్నాడని, మాస్, యాక్షన్, రా కంటెంట్ ఎక్కువగా ఉంటుందని, సముద్రం ఒడ్డున ఉండే ఊర్లోని కథ అని కొరటాల శివ ఆల్రెడీ చెప్పాడు.

నేడు టైటిల్, ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని ప్రకటించారు. తాజాగా ఎన్టీఆర్ 30వ సినిమా టైటిల్ ప్రకటించారు చిత్రయూనిట్. గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో అందరూ అనుకునే ‘దేవర’ టైటిల్ నే ప్రకటించారు. ఇక ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కూడా ఫుల్ మాస్ గా ఉంది. దీంతో టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, అభిమానులు పవర్ ఫుల్ టైటిల్ అని అంటున్నారు.

 

Also Read : Anchor Rashmi : అందుకే యాంకర్ రష్మీకి సినిమా అవకాశాలు రావట్లేదట.. ఎమోషనల్ అయిన రష్మీ..