Dussehra Release : దసరాని వాళ్లకే వదిలేశారా.. పోటీ పడే కంటే ఆరోజు రావొచ్చుగా..?

డిసెంబర్ 6న వస్తుండగా గేమ్ చేంజర్ సినిమా క్రిస్మస్ రేసులో దిగనుంది. ఐతే అంతా బాగుంది కానీ దసరా సీజన్ ని మాత్రం అలా వదిలేశారని అనిపిస్తుంది.

  • Written By:
  • Publish Date - July 24, 2024 / 07:21 PM IST

ఆగష్టు, సెప్టెంబర్ నెలలో కొన్ని ఆ తర్వాత డిసెంబర్ లో మరికొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ అక్టోబర్ 10 దసరా రేసులో ఏ తెలుగు సినిమా రావట్లేదని తెలుస్తుంది. ఆగష్టు 15న డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్, ఆగష్టు 29న సరిపోదా శనివారం, సెప్టెంబర్ 27న దేవర వస్తుండగా పుష్ప 2, గేమ్ చేంజర్ (Game Changer) సినిమాలు డిసెంబర్ లో రిలీజ్ పెట్టుకున్నాయి.

పుష్ప 2 సినిమా డిసెంబర్ 6న వస్తుండగా గేమ్ చేంజర్ సినిమా క్రిస్మస్ రేసులో దిగనుంది. ఐతే అంతా బాగుంది కానీ దసరా సీజన్ ని మాత్రం అలా వదిలేశారని అనిపిస్తుంది. ముందు దసరాకి దేవర వస్తుందని అనౌన్స్ చేశారు. కానీ సెప్టెంబర్ 27కి ప్రీ పోన్ చేశారు. మరి అంత అర్జెంట్ గా ముందుకు ఎందుకు జరిపారో తెలియదు.

అక్టోబర్ 10న రావాల్సిన దేవర (Devara)ను సెప్టెంబర్ 27న తెస్తున్నారు. ఐతే ఆ డేట్ కి సూపర్ స్టార్ రజినికాంత్ వేటయ్యన్, సూర్య కంగువ సినిమాలు వస్తున్నాయి. సూర్య కంగువ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో వస్తుంది. అక్టోబర్ దసరా రేసులో ఏ తెలుగు సినిమా రిలీజ్ షెడ్యూల్ చేయలేదు. చూస్తుంటే దసరాని డబ్బింగ్ సినిమాలకు వదిలి పెట్టారని అనిపిస్తుంది. దసరా బరిలో వస్తే ఆ సినిమాకు బిజినెస్ బాగా జరుగుతుంది. ఒకవేళ సూర్య కంగువ (Surya Kanguva) సినిమాను తెలుగు నిర్మాతలు స్ట్రైట్ సినిమాగా పరిగణలో తీసుకుని ఆ సినిమాను సోలో రిలీజ్ కోసం ఇలా ఏ సినిమాను తీసుకు రావట్లేదా అన్న డౌట్ కూడా కొడుతుంది.

మిగతా టైంలో ఒకేరోజు రెండు సినిమాలు రిలీజ్ పెట్టేకంటే ఇలా ఫెస్టివల్ నాడు రిలీజ్ చేస్తే బెటర్ కదా అని అంటున్నారు. మరి తెలుగు మేకర్స్ ప్లాన్ ఏంటో కానీ ఆడియన్స్ కు మాత్రం ఏమి అర్ధం కావట్లేదు.

Also Read : IPL Couches: కోచ్‌లుగా మారుతున్న 2011 ప్రపంచకప్ హీరోలు

Follow us