Site icon HashtagU Telugu

Ram Charan Fans: రెండేళ్లు అయినా నో రిలీజ్.. డైరెక్టర్ శంకర్ పై మెగాభిమానులు సీరియస్

Game Changer

Ram Charan Game Changer Movie Climax Fight Planning with 1200 Fighters

రెండేళ్ల క్రితం సెప్టెంబర్ 8న శంకర్‌తో రామ్ చరణ్ సినిమా లాంఛనంగా లాంచ్ అయినప్పుడు మెగా అభిమానులు ఖుష్ అయ్యారు.  శంకర్‌తో సినిమా చేయడం ఏ నటుడికైనా గౌరవం, ఎందుకంటే SS రాజమౌళి తర్వాత అత్యున్నత డైరెక్టర్ గా గుర్తింపు ఉంది. గేమ్ ఛేంజర్ RRRకి సరైన ఫాలో-అప్ అవుతుందని, రామ్ చరణ్ స్టార్‌డమ్‌ను తదుపరి స్థాయికి తీసుకువెళుతుందని అభిమానులు భావించారు. అయితే ఈరోజు అదే అభిమానులు శంకర్‌తో  రామ్ చరణ్ వర్క్ చేస్తున్నందుకు నిరుత్సాహానికి గురవుతున్నారు.

రెండేళ్లు కావస్తున్నా సినిమా ఎక్కడా పూర్తికాలేదు. రామ్ చరణ్ టైమ్ వృధా అయింది. ఈ మూవీ ఆలస్యానికి కారణం ఇండియన్ 2 సినిమా. ఇండియన్ 2 మొదట విడుదల కావాల్సి ఉండటంతో దీంతో  గేమ్ ఛేంజర్ షూటింగ్ పై ప్రభావం పడింది. ప్రస్తుతం, “గేమ్ ఛేంజర్” పూర్తి కాకుండానే ఉంది. సినిమా 50% కూడా పూర్తి కాలేదు. థియేటర్లలోకి రావాలంటే మరో సంవత్సరం పట్టవచ్చు. దీంతో వీలైనంత త్వరగా ఈ ‘గేమ్ ఛేంజర్’ టార్చర్ నుంచి బయటపడాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.

Also Read: #Gopichand32: ఫ్లాపుల్లో ఉన్న గోపీచంద్ కు శ్రీనువైట్ల హిట్ ఇచ్చేనా