Ram Charan RC15: డైలమాలో రామ్ చరణ్.. 2023లో ‘RC15’ లేనట్టే!

మెగా హీరో రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ‘RC15’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
ramcharan

ramcharan

మెగా హీరో రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ‘RC15’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 2023 వేసవిలో ఈ మూవీని విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ 2024లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కమల్ విక్రమ్ మూవీ అపూర్వ విజయం తర్వాత, ఇండియన్ -2 మళ్లీ మొదలైంది. శంకర్ కమల్ మూవీతో బిజీగా ఉన్నాడు. దీంతో రామ్ చరణ్ RC15 విషయంలో ఊహించనివిధంగా వాయిదాలు పడుతూ వస్తోంది.

ఈ మూవీకి ఇంకా 100-120 రోజుల షూటింగ్, మరో 3-4 నెలల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అవసరం. ఈ ఇష్యూస్ కారణంగా RC15 2023లో విడుదలయ్యే అవకాశం లేదు. 2024 సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది. RRR హీరోలిద్దరూ 2023లో తెరపై కనిపించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. NTR30 ఇప్పటికీ సెట్స్‌పైకి రాలేదు. RC15 నిర్మాణంలో ఉన్నప్పటికీ శంకర్ కారణంగా మరింత ఆలస్యమయ్యేలా ఉంది. RC15 తర్వాత రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని ఇంకా ఫైనల్ చేయలేదు. కాబట్టి 2023లో ఈ మెగా హీరో సినిమా ఉండకపోవచ్చు.

  Last Updated: 03 Oct 2022, 05:07 PM IST