Site icon HashtagU Telugu

Salaar Promotions: సలార్ మూవీకి ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్ లేనట్లేనా..?

Prabhas Salaar 2 Shelved Rebal Star Fans Dissappointed

Prabhas Salaar 2 Shelved Rebal Star Fans Dissappointed

Salaar Promotions: ఆదిపురుష్ మూవీ తర్వాత ప్ర‌భాస్ నుంచి వస్తున్న మరో పాన్ ఇండియా మూవీ స‌లార్ (Salaar Promotions). మ‌రో 9 రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయినా చిత్రబృందం ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేయలేదు. స‌లార్ మూవీలో ఎలాంటి ప్ర‌మోష‌న్స్‌, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లేకుండానే డైరెక్ట్‌గా సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

ప్రభాస్ నుంచి వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్‌ సినిమాల కోసం చిత్ర బృందాలు పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో ప్ర‌మోష‌న్స్ నిర్వహించారు. ప్రభాస్ గత చిత్రాల కోసం అన్ని భాష‌ల్లో ఇంట‌ర్వ్యూలు, స్పెష‌ల్ ఈవెంట్స్‌కు హాజ‌ర‌య్యారు. స‌లార్‌ మూవీకి వచ్చేసరికి ఇవేమీ కనిపించటం లేదు. స‌లార్ ప్ర‌మోష‌న్స్‌కు దూరంగా ఉన్న ప్ర‌భాస్ క‌ల్కి షూటింగ్‌తో బిజీగా ఉన్నట్లు సమాచారం. పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో స‌లార్ మూవీపై క్రేజ్ నెల‌కొంది.

Also Read: Devil Trailer : కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ ట్రైలర్ టాక్ …

దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా యూనిట్ మాత్రం ప్ర‌మోష‌న్స్ మాత్రం ఇంకా స్టార్ట్ చేయలేదు. దీనికి కారణం కూడా ఉంది అంటున్నారు అభిమానులు. ప్రభాస్ క్రేజ్ పాన్ ఇండియా లెవెల్ లో ఉండటంతో ప్రమోషన్స్ కూడా అవసరంలేదని కొందరు ఫ్యాన్స్ అంటున్నారు. రిలీజ్‌కు తక్కువ సమయం ఉండటంతో సలార్ మూవీ ప్రమోషన్స్ పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో చేయడం దాదాపు కష్టమే.

We’re now on WhatsApp. Click to Join.

అయితే ఈ మూవీకి ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్ర‌మోష‌న్స్ లేకుండా సినిమాను డైరెక్ట్ గా రిలీజ్ చేయాల‌నే ఆలోచ‌న‌లో చిత్రబృందం ఉన్న‌ట్లు తెలుస్తోంది. సినిమా రిలీజ్ లోపు సెకండ్ ట్రైలర్, ఒక పాటను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు చిత్ర యూనిట్ చెబుతుంది. అయితే ప్ర‌మోష‌న్స్ లేకపోవడంతో అభిమానులు ఫైర్ అవుతోన్నారు. క‌నీసం మూవీ కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా నిర్వ‌హిస్తే సినిమాపై బజ్ ఉంటుందని అంటున్నారు. స‌లార్ సినిమాలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమార‌న్, శృతిహాస‌న్‌, జ‌గ‌ప‌తిబాబు, బాబీ సింహా కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.