Kangana on Politics: పొలిటికల్ ఎంట్రీపై కంగన క్లారిటీ

బాలీవుడ్ టాప్ హీరోయిన్, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తన పొలికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు.

Published By: HashtagU Telugu Desk
Kangana

Kangana

బాలీవుడ్ టాప్ హీరోయిన్, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తన పొలికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్‌గా రాణిస్తున్న ఈ భామ నిత్యం వివాదస్పద కామెంట్స్ తో మీడియాలో కనిపిస్తుంటారు. వివిధ సామాజిక అంశాలపై కూడా ఆమె స్పందిస్తుంటారు. సోషల్ మీడియాలో కూడా ఆమె బాగా ప్రాచుర్యం పొందారు. రాజకీయంగా కూడా కంగనకు మంచి పాపులార్టీ ఉంది. బీజేపీకి అనుకూలంగా తరచూ వ్యాఖ్యానిస్తుంటారు. ఆమె రాజకీయ ఎంట్రీపై చాలా కాలంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. కానీ ఆమె ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీలో చేరలేదు. తెలుగులో కూడా ఏక్ నిరంజన్ చిత్రంలో ప్రభాస్ సరసన నటించిన కంగన తాజాగా పొలిటికల్ ఎంట్రీపై వివరణ ఇచ్చారు.
‘‘రాజకీయాల్లోకి రావడంపై నా వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవు. రానున్న సినిమాల షూటింగ్ పనులతో నేను తీరిక లేకుండా ఉన్నాను. నాకు రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది. కానీ, నటనపరంగా నేను విజయవంతమైన నటిని. 16 ఏళ్లకే నా కెరీర్ ను ప్రారంభించాను. ఎన్నో కష్టాల తర్వాత ఈ స్థాయికి చేరుకున్నాను’’అని కంగన చెప్పారు.

రాజకీయాల పట్ల తనకున్న ఆసక్తి తన నటనలో ప్రతిఫలిస్తుందన్నారు. రాజకీయాలను దృష్టిలో ఉంచుకునే తానెప్పుడూ మంచి సినిమాలు తీస్తుంటానని చెప్పారు. ‘‘నేను దేశభక్తురాలిని. నా పనితో నేను ఎంతో బిజీగా ఉంటాను. కనుక దేశానికి మంచి చేసే వారికి పార్టీతో సంబంధం లేకుండా నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది’’అని కంగనా రనౌత్ తెలిపారు.

  Last Updated: 03 Oct 2022, 10:24 PM IST