Bigg Boss: నో ఆప్షన్.. కింగ్ నాగార్జునే బిగ్ బాస్ హోస్ట్!

బిగ్ బాస్ సీజన్ సెవన్ స్టార్ట్ కాబోతోంది. అయితే ఎవరు హోస్ట్ అనేది దాదాపుగా తెలిసిపోయింది.

Published By: HashtagU Telugu Desk
Bigg Boss Season 6

Bigg Boss Season 6

రియాల్టీ షో అనగానే చాలామందికి మొదటగా గుర్తుకు వచ్చేది బిగ్ బాస్ షోనే. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ సెవన్ స్టార్ట్ కాబోతోంది. అయితేసెవంత్ సీజన్‌కి హోస్ట్ నాగ్ కాదన్నారు. కానీ చివరికి తనే ఫిక్స్ అయ్యాడని తెలుస్తోంది. మరో హీరో ఎవరూ ముందుకు రాకపోవటంతో, నాగ్‌నే మళ్లీ ఒప్పించారట. నాగ్ కూడా కొత్త సినిమాలేవీ ఫైనల్ చేయకపోవడంతో మళ్లీ బిగ్ బాస్ కొత్త సీజన్‌కి సై అన్నాడట. కాకపోతే బిగ్‌బాస్ షోకు సంబంధించి ఇప్పటికే ఒక్కో సీజన్‌లో కంటెస్టెంట్లు, గేమ్స్ అన్నీ బోర్ కొడుతూ కొడుతూ, క్యూరియాసిటీ తగ్గుతూ వస్తోంది.

సో ఏడో సీజన్‌కి రేటింగ్స్ పెరిగేలా నిర్వాహకులు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. నాగ్ కూడా మరింత జోరు చూపే అవకాశం ఉంది.  బిగ్ బాస్ 7’కు కూడా నాగార్జున హోస్ట్ చేస్తారని ప్రచారం కూడా జరిగింది. సో.. ప్రస్తుతానికి అక్కినేని నాగార్జున స్థానంలో మరొకరిని ఊహించుకోవాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ మొదటి వారంలో ‘బిగ్ బాస్ 7’ మొదలు అవుతుందని తెలిసింది.

సెప్టెంబర్ 2 లేదా 3వ తేదీన లాంచింగ్ ఎపిసోడ్ ఉండే అవకాశాలు ఎక్కువ. వరుస ఫెయిల్యూర్స్ అక్కినేని హీరోలకు ఇబ్బందులుగా మారాయి. అఖిల్ ఏజెంట్, నాగచైతన్య కస్టడీ మూవీలు సైతం ఘోరంగా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఇక నాగార్జున కొత్త సినిమాల కథలు వింటున్నా.. వేగం అందుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో నాగార్జున్ బిగ్ బాస్ తో ఎంటర్ టైన్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఈసారి నాగార్జున బదులు రానా దగ్గుబాటి హోస్ట్ చేస్తారని ప్రచారం జరిగింది. అందులో అసలు నిజం లేదని ‘బిగ్ బాస్’ తెలుగు సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.

Also Read: BJP Leader Kidnapped: హైదరాబాద్ లో బీజేపీ లీడర్ కిడ్నాప్.. భూ వివాదమే కారణం

  Last Updated: 14 Jul 2023, 02:46 PM IST