పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు (Fans) బ్యాడ్ న్యూస్ (Bad News)..ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు , మరోవైపు రాజకీయాలు చేస్తూ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇది మొన్నటి వరకు కానీ ఇక పూర్తి సమయం రాజకీయాలకే కేటాయించాలని చూస్తున్నారు. ఎందుకంటే ఏపీలో ఎన్నికలకు 100 రోజుల సమయం కూడా లేకపోవడం తో ఇక రాజకీయాల వైపే దృష్టి పెట్టాలని ఫిక్స్ అయ్యారట. అందుకే ప్రస్తుతం సెట్స్ ఫై ఉన్న చిత్ర యూనిట్ లకు ఈ విషయాన్నీ చెప్పడం జరిగిందట.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె పవన్ కళ్యాణ్ చేస్తున్న చిత్రాల్లో #OG ఒకటి. సాహో డైరెక్టర్ సుజిత్ (Sujeeth) డైరెక్షన్లో తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టార్ నేపథ్యం కథ ఇది. ఆ మధ్య పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుకగా ఓజీ నుంచి హంగ్రీ చీతా అంటూ వచ్చిన చిన్నపాటి టీజర్ పెను విధ్వంసమే సృష్టించింది. ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ హోదాలో పవన్ కళ్యాణ్ కత్తితో చేసిన విన్యాసాలతో పాటు ఒక పెద్ధ గన్ పట్టుకొని శత్రువులని తుదముట్టించడానికి వెళ్తుంటే ఫ్యాన్స్ ఊగిపోయారు. ఇక ఆ తర్వాత ఈ చిత్రం నుండి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ క్రమంలో న్యూ ఇయర్ సందర్బంగా చిత్ర యూనిట్ నుండి అదిరిపోయే అప్డేట్ రాబోతుందని ప్రచారం మొదలైంది. కొంతమంది టీజర్ వస్తుందని , మరికొంతమంది పోస్టర్ వస్తుందని ఇలా ఎవరికీ వారు మాట్లాడుకోవడం , ప్రచారం చేయడం మొదలుపెట్టారు.
ఈ క్రమంలో ఫ్యాన్స్ డిమాండ్ బాగా పెరిగిపోయేసరికి కొత్త ఏడాది కానుకగా ఓజీ నుంచి ఎలాంటి ట్రీట్ ఇవ్వట్లేదంటూ ఆ మూవీ నిర్మాణ సంస్థ డి వి వి ఎంటర్‌టైన్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో పవన్ ఫ్యాన్స్ తెగ హర్ట్ అయిపోతున్నారు. కనీసం పోస్టర్ రిలీజ్ చేసినా బాగుండేదంటు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, హరీష్ ఉత్తమన్ లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీత సారథ్యంలో ఓజీ తెరకెక్కుతుంది.
Read Also : Barrelakka: రామ్ గోపాల్ వర్మపై బర్రెలక్క ఫిర్యాదు