Site icon HashtagU Telugu

Ram charan: రామ్ చరణ్‌ని లార్డ్ రామ్‌గా ప్రొజెక్ట్ చేయాలనే ఉద్దేశ్యం లేదు: RRR రైటర్

ramcharan rrr

ramcharan rrr

Ram charan: మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి బ్లాక్ బస్టర్ల వెనుక సూత్రధారి అయిన రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇటీవలి ఇంటర్వ్యూలో RRR గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలను పంచుకున్నారు. క్లైమాక్స్‌లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గెటప్‌లో కనిపించాడు, కాని నార్త్ ప్రేక్షకులు చరణ్‌ను లార్డ్ రామ్ అని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇదే విషయమై విజయేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ.. ”ఇక్కడ మనం పరిగణించవలసిన రెండు అంశాలు ఉన్నాయి. మొదట నార్త్ ప్రేక్షకులు రామ్ చరణ్‌ని రాముడిగా భావించి సినిమాకు అనుకూలంగా మారారు.

ఆర్‌ఆర్‌ఆర్‌లో రామ్‌చరణ్‌ని లార్డ్‌ రామ్‌గా చూపించాలని మేము ఎప్పుడూ అనుకోలేదు. అల్లు సీతారామరాజుగా నటించాలనుకున్నాం. రాముడు అనే పేరు సీతారామరాజులో ఒక భాగం, అలాగే అతను శ్రీరాముని భక్తుడు కూడా. “హిందీ బెల్ట్‌లోని ప్రేక్షకులు తమ కంటే ముందే శ్రీరాముడు వచ్చినట్లు భావించారు. స్క్రిప్టింగ్ దశలో మాకు ఎప్పుడూ అలాంటి ఆలోచన లేదు. ఇది కేవలం యాదృచ్చికం. ఇది ఉద్దేశపూర్వకంగా చేయలేదు. మనం ఎందుకు అలా ఆలోచిస్తాము? ” అని అన్నాడు.

ఇది యాదృచ్ఛికంగా జరిగినప్పటికీ, హిందీలో సినిమాకు భారీ వసూళ్లు రాబట్టింది. అలాగే, చరణ్ లార్డ్ రామ్ పాత్రను పోషించాడని నమ్మిన ఉత్తర ప్రేక్షకుల నుండి ఘనమైన ప్రశంసలు అందుకున్నాడు. తెరపై శ్రీరాముడిగా ఎవరు నటించాలి అనే చర్చ జరిగినప్పుడల్లా, ఉత్తర ప్రేక్షకులు చరణ్‌ను ఇష్టపడతారు అని ఆయన వెల్లడించారు.