Site icon HashtagU Telugu

Amala Paul: అమలా పాల్ కు అవమానం.. కేరళ గుడిలోకి నో ఎంట్రీ!

Amal Paul

Amal Paul

కేరళ, (Kerala) తిరువైరానిక్కులం, మహాదేవ గుడి లో హీరోయిన్ అమలా పాల్ (Amala Paul) కు చేదు అనుభవం ఎదురైంది. దేవస్థానం ఆమెను లోనికి అనుమతించలేదు. 2023 లో కూడా మాత పరమైన వివక్ష ఇంకా కొనసాగడం విచారకరం. త్వరలో మార్పు వస్తుందని ఆశిస్తున్నా.. అంటూ ఆమె టెంపుల్ రిజిస్టర్ లో రాసుకొచ్చారు. తనకు మతపరమైన వివక్ష కారణంగా అనుమతి నిరాకరించారని నటి అమలా పాల్ (Amala Paul) ఆరోపించారు. ప్రాంగణంలోనికి హిందువులను మాత్రమే అనుమతించే ఆచారాలను ఉటంకిస్తూ, ఆలయ అధికారులు ఆమెకు దర్శనం నిరాకరించినట్లు ఆరోపణలు వచ్చాయి.

తనకు పూజారులు దర్శనం నిరాకరించి, ఆలయం ముందు ఉన్న రహదారి నుండి అమ్మవారి దర్శనం చేసుకోమని చెప్పారని అమలా పాల్ పేర్కొన్నారు. (Amala Paul) ఆలయ సందర్శకుల రిజిస్టర్‌లో అమలా పాల్ తన అనుభవాన్ని పంచుకుంది, ఇంకా మతపరమైన వివక్ష కొనసాగడం విచారకరమని ఆమె అన్నారు. ఈ ఘటన వెలుగులోకి రాగానే తిరువైరానికుళం మహాదేవ ఆలయ నిర్వాహకులు స్పందించారు. తాము ఇప్పటికే ఉన్న ప్రోటోకాల్‌లను మాత్రమే పాటిస్తున్నామని వారు తెలిపారు.

Also Read: Jr.NTR and Kalyan Ram: నేడు ఎన్టీఆర్ వర్ధంతి.. జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళి