Chiranjeevi – Director Koratala Clash : డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva)..తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత హయ్యస్ట్ సక్సెస్ రేట్ ఉన్న స్టార్ డైరెక్టర్.బీటెక్ పూర్తిచేసిన శివ, 1998లో ఉద్యోగం చేసుకుంటూ తనకు బావ వరుసైన పోసాని కృష్ణ మురళి దగ్గర సహాయకుడిగా చేరాడు. ఆ తర్వాత ఒక్కడున్నాడు, మున్నా, బృందావనం, ఊసరవెల్లి వంటి సినిమాలకు మాటల రచయితగా పనిచేశాడు. 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి సినిమాతో దర్శకుడిగా మారాడు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత మహేష్ బాబు తో శ్రీమంతుడు , ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ , భరత్ అను నేను వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి ఇండస్ట్రీ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చిరంజీవి (Chiranjeevi) తో ఆచార్య (Acharya) మూవీ చేసాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయ్యింది. అప్పటివరకు ఉన్న హిట్లను సైతం మరచిపోయి..శివ ఫై అభిమానులు రెచ్చిపోయారు.
ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని ఎన్టీఆర్ తో దేవర (Devara) చేసాడు. రెండు పార్ట్స్ గా రాబోతున్న ఈ మూవీ..ముందుగా మొదటి పార్ట్ ఈ నెల 27 న రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాలోని సాంగ్స్ , ట్రైలర్ , టీజర్స్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు పెంచేసాయి. ఇక ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా సినిమా విశేషాలను పంచుకుంటూ మరింత ఆసక్తి పెంచుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో కొరటాల సినిమా విశేషాలతో పాటు చిరంజీవి తో గొడవ ఫై కూడా క్లారిటీ ఇచ్చారు. “దేవర”లో భయం అనే ఒక ఎమోషన్ సినిమా మొత్తం క్యారీ అవుతుంటుంది. నిజానికి ప్రతి మనిషిలో భయం ఉండాలి. మనం ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయకపోవడానికి కారణం భయమే. అది బాధ్యతతో కూడిన భయం. ఆ భయాన్నే సినిమాలో మెయిన్ థీమ్ గా పెట్టుకున్నాను అని తెలిపాడు. నేను ఎన్టీఆర్ ను ఒక బ్రదర్ లా ట్రీట్ చేస్తాను. అతను కూడా అదే స్థాయిలో నాతో బంధం పంచుకుంటాడు.
నేను ఏదైనా సీన్ చెప్తే బాగుంది అనిపిస్తే “అబ్బా అదిరిపోయింది” అని చెప్తాడు. ఒకవేళ నచ్చకపోతే కూడా అదే ఉచ్ఛస్థాయిలో బాలేదని చెప్పేస్తాడు. ఎన్టీఆర్ అంత హానెస్ట్ గా ఉంటాడు కాబట్టే ప్రొడక్ట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ ఉండదు. ఆచార్య రిజల్ట్ విషయంలో కాస్త బాధపడిన విషయం వాస్తవమే కానీ, ఆ రిజల్ట్ నా మీద ఎఫెక్ట్ చూపించే స్థాయి గ్యాప్ నేను తీసుకోలేదు. “ఆచార్య” విడుదలైన 20 రోజులకు “దేవర” మోషన్ పోస్టర్ వర్క్ మొదలుపెట్టాం. అందువల్ల ఆ రిజల్ట్ ను కానీ, రిజల్ట్ ఎఫెక్ట్ ను కానీ నేను తర్వాత పట్టించుకోవాల్సిన పని పడలేదు. ‘ఆచార్య ఫ్లాప్ అయ్యాక మెగాస్టారే నాకు మొదటిగా మెసేజ్ చేసిన వ్యక్తి. అనవసరంగా ఇంటర్వ్యూల్లో ఆయన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. మా మధ్య మంచి అనుబంధం ఉంది’ అని క్లారిటీ ఇచ్చారు.
Read Also : Ram Mohan Naidu : మానవ తప్పిదాలతో విమాన ప్రమాదాలు 10 శాతం పెరిగాయ్ : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు