Site icon HashtagU Telugu

No Buzz Ponniyan Selvan: మణిరత్నం మూవీకి నో హైప్.. టాలీవుడ్ లో వెరీ డల్!

Ponniyan Selvan

Ponniyan Selvan

భారతదేశంలోని ఆల్ టైమ్ గొప్ప దర్శకుల్లో మణిరత్నం ఒకరు. మణిరత్నం సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. కానీ కొత్త తరం ప్రేక్షకులు, హీరోలకు గురవుతారు. అలాంటి డైరెక్టర్ తన ట్రాక్ ను పూర్తి మార్చేశారు. పీరియాడికల్ డ్రామాలతో క్రేజీగా ఉన్న ప్రస్తుత తరానికి నచ్చే చిత్రాన్ని రూపొందించారు. “పొన్నియన్ సెల్వన్” సినిమా అలాంటి కథే. ఈ సినిమా ట్రైలర్ బయటకు వచ్చింది. ఒకటిరెండు పాటలు విడుదలయ్యాయి.

అయితే తెలుగులో మాత్రం ఈ సినిమాపై బజ్ తక్కువగానే ఉంది. మణిరత్నం భారీ చిత్రం కోసం తమిళ మార్కెట్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, కీలకమైన తెలుగు మార్కెట్ చాలా డల్ గా ఉంది. తెలుగులో ఈ సినిమాని మార్కెట్ చేస్తున్న దిల్ రాజు హైప్ క్రియేట్ చేయడానికి భిన్నంగా ఆలోచించాలి. సాధారణంగా పీరియాడికల్ సినిమా వస్తుందంటే తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ గురించి డిస్కషన్ చేస్తుంటారు. కానీ మణిరత్నం సినిమా విషయంలో ఇలాంటివేమీ కనిపించడం లేదు.