నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) నటిస్తున్న తాజా సినిమా NKR21 టైటిల్‌పై అనేక వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిస్తుండగా.. ప్రముఖ సినీ నటి విజయశాంతి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. చిత్ర బృందం సినిమాకు ఒక పవర్‌ఫుల్ టైటిల్ పెట్టే ప్రయత్నాల్లో ఉంది. ఈ నేపథ్యంలో “అర్జున్ సన్నాఫ్ వైజయంతి” (Arjun Son Of Vyjayanthi) అనే పేరు టైటిల్‌గా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
Water Problem : హైదరాబాద్ లో మొదలైన నీటి కష్టాలు
ఈ సినిమాలో విజయశాంతి పాత్ర పేరు వైజయంతి కాగా, ఆమె కుమారుడిగా కళ్యాణ్ రామ్ అర్జున్ అనే పాత్రను పోషించనున్నట్లు తెలుస్తోంది. కథను బట్టి చూస్తే ఈ టైటిల్ సినిమా కథాంశానికి చాలా హ్యాండీగా ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. టైటిల్ విషయమై ఇప్పటివరకు మూవీ టీమ్ అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఈ పేరును ఫైనల్ చేయవచ్చనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. గతంలో విజయశాంతి పవర్‌ఫుల్ పాత్రలతో అలరించిన నేపథ్యంలో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
SA vs NZ: నేడు దక్షిణాఫిక్రా-న్యూజిలాండ్ మధ్య రెండో సెమీఫైనల్!
కళ్యాణ్ రామ్ సినిమాలకు వైవిధ్యమైన కథలు ఎంచుకుంటారు. గతంలో ఆయన నటించిన “బింబిసార” బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. అందువల్ల ఆయన నుండి మరో వినూత్నమైన కథాంశం రావచ్చని సినీ ప్రేమికులు ఆశిస్తున్నారు. ఈ కొత్త చిత్రంలో కూడా ఆయన పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారని, కథలో మలుపులు ఆకట్టుకునేలా ఉంటాయని చెబుతున్నారు.