తాను ఇంకా నిశ్చితార్థం చేసుకోలేదని నటి నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj)స్పష్టం చేసింది. ఇటీవల తన పెళ్లి, నిశ్చితార్థం గురించి పలు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన నివేదా, తాను అక్టోబర్‌లో నిశ్చితార్థం, జనవరిలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపింది. ఇంకా తేదీలు ఖరారు కాలేదని ఆమె పేర్కొన్నారు. తాను దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త రాజ్‌హిత్ ఇబ్రాన్‌తో ఐదేళ్లుగా స్నేహంగా ఉన్నానని, ఇప్పుడు పెళ్లి బంధంతో ఒకటవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
Ram Charan Met CM: సీఎం సిద్ధరామయ్యను కలిసిన రామ్ చరణ్.. వీడియో వైరల్!
నివేదా చెప్పిన వివరాల ప్రకారం.. రాజ్‌హిత్‌తో ఆమె స్నేహం ఐదేళ్ల క్రితం దుబాయ్‌లో ప్రారంభమైంది. అప్పటి నుంచి వారి మధ్య బలమైన స్నేహ బంధం ఏర్పడింది. ఒకరికొకరు మంచి స్నేహితులుగా ఉన్నప్పుడు, ఆ బంధాన్ని ఎందుకు పెళ్లి వరకు తీసుకెళ్లకూడదని భావించామని నివేదా వివరించారు. ఈ నిర్ణయం పరస్పరం ఇద్దరి మధ్య కుదిరినట్లు ఆమె తెలిపారు. రాజ్‌హిత్‌కు దుబాయ్‌లో వ్యాపారాలు ఉన్నాయని, వారిద్దరూ కలిసి జీవితాన్ని ప్రారంభించడానికి సంతోషంగా ఎదురుచూస్తున్నారని నివేదా పేర్కొన్నారు.
ఈ ప్రకటనతో నివేదా వ్యక్తిగత జీవితంపై ఉన్న పుకార్లకు తెరపడింది. ఆమె స్వయంగా పెళ్లి, నిశ్చితార్థం గురించి స్పష్టత ఇవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న నివేదాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నివేదా పేతురాజ్ తెలుగులో “మెంటల్ మదిలో”, “బ్రోచేవారెవరురా”, “అల వైకుంఠపురములో” వంటి చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్నారు.
India- China Direct Flights: భారత్- చైనా మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు.. ఎప్పుడు ప్రారంభం?