Site icon HashtagU Telugu

Nitya Menon : కుమారి శ్రీమతి టీజర్ చూశారా..!

Nitya Menon Kumari Srimthi

Nitya Menon Kumari Srimthi

తెలుగులో కీర్తి సురేష్ కన్నా ముందే మహానటిగా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న నిత్యా మీనన్ (Nitya Menon) మహానటిలో ఛాన్స్ మిస్ చేసుకుని చాలా తప్పు చేసింది. అఫ్కోర్స్ ఆ తర్వాత ఎన్.టి.ఆర్ బయోపిక్ లో నిత్యా సావిత్రి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. కీర్తి సురేష్ నిత్యా మీనన్ ఇద్దరిలో ఎవరు మహానటి అని చెప్పడం కష్టమే. కానీ ఇద్దరు మాత్రం ఎవరికి వారు ఇచ్చిన పాత్రకు నూటికి నూరు శాతం మెప్పించేస్తారు. ప్రేక్షకులను తమ అభినయం తో మెప్పించే తారామణుల్లో నిత్యా మీనన్ ఒకరు.

లేటెస్ట్ గా ఆమె కుమారి శ్రీమతి వెబ్ సీరీస్ చేసింది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అవసరాల శ్రీనివాస్ ఈ వెబ్ సీరీస్ డైరెక్ట్ చేశారు. బలబద్రపాత్రుని మధు, మల్లిక్ రాం ఈ వెబ్ సీరీస్ కు కథ అందించారు. పెళ్లి కాని నిత్యా మీనన్ (Nitya Menon ) కి పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చే తన పరిసరాల మధ్య చాలా సున్నితమైన అంశాలతో ఈ సీరీస్ తెరకెక్కిందని చెప్పొచ్చు.

ఈ వెబ్ సీరీస్ టీజర్ చూసి నిత్యా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. కుమారి శ్రీమతి వెబ్ సీరీస్ టీజర్ ఇంప్రెస్ చేసింది. సెప్టెంబర్ 28న అమేజాన్ ప్రైం వీడియోలో ఈ సీరీస్ రిలీజ్ అవుతుంది. తెలుగుతో పాటుగా ఇతర సౌత్ భాషలన్నిటిలో కుమారి శ్రీమతి రిలీజ్ అవుతుంది.

తెలుగు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు ఓటీటీ సంస్థలు కొత్త కొత్త వెబ్ సీరీస్ లతో వస్తున్నారు. అయితే కుమారి శ్రీమతి వెబ్ సీరీస్ మాత్రం మన మేకర్స్ తీసి అమేజాన్ ప్రైం కు ఇచ్చినట్టు ఉన్నారు. అమేజాన్ ప్రైం లో సెప్టెంబర్ 28న కుమారి శ్రీమతి సీరీస్ రాబోతుంది. మరి ఈ సీరీస్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందా లేదా అన్నది చూడాలి.

Also Read : Prabhas Maruthi Movie : ప్రభాస్ మారుతి.. చేయాల్సింది చాలా ఉందా..?