మలయాళ భామ నిత్యా మీనన్ మరో లక్కీ ఛాన్స్ అందుకుంది. తన సహజ నటనతో ఎలాంటి పాత్ర అయినా దానికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తుంది. తెలుగులో అందుకే ఆమెకు క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. ఐతే ఏమైందో ఏమో కానీ నిత్యాను సరిగా వాడుకోలేదన్న టాక్ అయితే ఉంది. ఐతే అప్పుడప్పుడు కాస్త తమిళ్ సినిమాలతో అలరిస్తున్న నిత్యా మీనన్ ధనుష్ తో తిరు సినిమాతో నేషనల్ అవార్డ్ కూడా అందుకుంది.
నిత్యా మీనన్ ధనుష్ తో తిరు సినిమా చేయగా మరోసారి ఆయనతో జత కడుతుంది. అందులోనూ ధనుష్ డైరెక్షన్ లో సినిమాగా రాబోతుంది. ఈమధనే రాయన్ తో సూపర్ హిట్ అందుకున్న ధనుష్ సొంత డైరెక్షన్ మీద కూడా సూపర్ కాన్ ఫిడెన్స్ తెచ్చుకున్నాడు. ఆ క్రమంలోనే ధనుష్ కొత్తగా ఇడ్లీ కొట్టు అనే సినిమా డైరెక్షన్ చేస్తున్నాడు.
నిత్యా మీనన్ హీరోయిన్ గా ఎంపిక..
ఈ సినిమాలో నిత్యా మీనన్ హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్నే చెబుతూ కొత్త ప్రయాణం మొదలైంది అని సోషల్ మీడియాలో మెసేజ్ చేసింది. నిత్యా మీనన్ లోని సహజ నటను చూసి ధనుష్ కూడా మెస్మరైజ్ అయినట్టే అనిపిస్తుంది. అందుకే సొంత డైరెక్షన్ లో సినిమాకు మరో హీరోయిన్ ఆప్షన్ లేకుండా ఆమెను తీసుకున్నారు. తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేని నిత్యా మీనన్ తమిళంలో మారం మంచి ఫలితాలు అందుకుంటుంది.
Also Read : Maniratnam Rajikanth : రజినితో మణిరత్నం.. అంతా ఉత్తిత్తేనా..?