Kumari Srimathi Trailer వైజయంతి మూవీస్ బ్యానర్ లో నిత్యా మీన లీడ్ రోల్ లో వస్తున్న వెబ్ సీరీస్ కుమారి శ్రీమతి. ఈ సీరీస్ కు సంబందించిన టీజర్ రీసెంట్ గా రిలీజై ఆడియన్స్ ని మెప్పించగా లేటెస్ట్ గా సీరీస్ కు సంబందించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ లో దాదాపు కథ మొత్తం రివీల్ చేశారని చెప్పొచ్చు. పెళ్లంటే అసలు పడని కుమారి శ్రీమతి తను పెళ్లి చేసుకోవాలంటే ఇల్లు తమకు దక్కాలని అనుకుంటుంది.
తాతల కాలం నాటి ఇల్లు అది కూడా బాబయ్ అడ్డం తిరగడం వల్ల కోర్ట్ కేస్ నడుస్తుంటుంది. అయితే కేసు తీర్పు లో ఆరు నెలల్లో ఆ ఇల్లు కొనుక్కునే అవకాశం ఇస్తుంది. ఆరు నెలల్లో 38 లక్షలు సంపాదించే టార్గెట్ తో కుమారి శ్రీమతి ముందడుగు వేస్తుంది. అయితే 6 నెలల్లో అన్ని లక్షలు సాధించాలంటే బార్ ఒక్కటే బెటర్ అని అనుకుంటుంది. Kumari Srimathi Trailer ట్రైలర్ చూస్తే ఎంతో ఆసక్తి కరంగా నిత్యా మీనన్ తన పాత్రకు పూర్తి స్థాయిలో నాయం చేసినట్టు అనిపిస్తుంది.
ఈ సీరీస్ లో నిత్యా మీనన్ తో నిరుపం, తిరువీర్ కూడా నటించాడు. అమేజాన్ ప్రైం వీడియోలో సెప్టెంబర్ 28న ఈ వెబ్ సీరీస్ రిలీజ్ అవుతుంది. ట్రైలర్ చూసిన ఎవరైనా సరే వెబ్ సీరీస్ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. సినిమాల్లో వెనకబడ్డ నిత్యా మీనన్ వెబ్ సీరీస్ లతో మెప్పించాలని చూస్తుంది. మరి ఈ కుమార్ శ్రీమతి ఏమేరకు ఓటీటీ ఆడియన్స్ ని అలరిస్తుందో చూడాలి. ఈ సీరీస్ ను అవసరాల శ్రీనివాస్ డైరెక్ట్ చేయగా బలబధ్ర పాత్రుని మధు, మల్లిక్ రాం లు కథ అందించారు.
Also Read : KGF Hero: నిర్మాతగా మారిన కేజీఎఫ్ హీరో