Sudheer Babu & Krithi Shetty: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి!

నైట్రో స్టార్ సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో విలక్షణమైన ప్రేమకథగా వస్తున్న చిత్రం

Published By: HashtagU Telugu Desk
Aa Ammai

Aa Ammai

నైట్రో స్టార్ సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో విలక్షణమైన ప్రేమకథగా వస్తున్న చిత్రం”ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ అవుతుంది. నిర్మాతలు దీనికి సంబధించిన అధికారిక ప్రకటన చేశారు. ఈ చిత్రంలో నైట్రో స్టార్ సుధీర్ బాబుకు జోడిగా డాజ్లింగ్ బ్యూటీ కృతిశెట్టి కథానాయికగా కనిపించనుంది. నిర్మాతలు బి మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి బెంచ్‌మార్క్ స్టూడియోస్‌పై మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

గాజులపల్లె సుధీర్ బాబు చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇంద్రగంటి గత సినిమాల్లాగే ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’లో కూడా సంగీతానికి మంచి ప్రాధాన్యత వుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ కొత్త కొత్త గా పాట ప్లజంట్ కంపోజిషన్ తో ఆకట్టుకున్నారు వివేక్ సాగర్. ఆల్బమ్‌లోని మిగతా పాటలు కూడా సంగీత ప్రియులను ఆకట్టుకోబోతున్నాయి. ఈ చిత్రానికి పిజి విందా సినిమాటోగ్రఫర్ గా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణి నటరాజన్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

  Last Updated: 11 Aug 2022, 03:17 PM IST