Sudheer Babu Look: సుధీర్ బాబు ఏంటీ.. ఇలా మారిపోయాడు!

పొడవాటి జుట్టు , గడ్డంతో సుధీర్ బాబు ఇక్కడ కొంచెం లావు గా కనిపిస్తున్నాడు. ఈ పాత్ర ఊబకాయంతో ఉండే వ్యక్తి గా ఉండబోతుంది

Published By: HashtagU Telugu Desk
Sudheer Babu

Sudheer Babu

నైట్రో స్టార్ సుధీర్ బాబు (Sudheer Babu) కథానాయకుడిగా నటుడు దర్శకుడు హర్షవర్ధన్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న చిత్రం మామా మశ్చీంద్ర .ఈ చిత్రంలో హీరో ని మూడు విభిన్న షేడ్స్లో చూపించ బోతున్నారు హర్షవర్ధన్ . సుధీర్ బాబు దుర్గ, పరశురామ్, డీజే మూడు పాత్ర లలో కనిపిస్తారు. మేకర్స్ ఈరోజు దుర్గ లుక్ విడుదల చేసారు.

పొడవాటి జుట్టు , గడ్డంతో సుధీర్ బాబు (Sudheer Babu) ఇక్కడ కొంచెం లావు గా కనిపిస్తున్నాడు. ఈ పాత్ర ఊబకాయంతో ఉండే వ్యక్తి గా ఉండబోతుంది అని తెలుస్తుంది. కారు బానెట్ పై కూర్చున్న సుధీర్ బాబు బంగారు గొలుసు వాచ్, ట్రెండీ అవుట్ ఫిట్ ధరించి విలనీ స్మైల్ తో కనిపించాడు. నైట్రో స్టార్ మేక్ఓవర్ ఆశ్చర్యం కలిగించే లాగా ఉంది. సుధీర్ బాబు (Sudheer Babu) ఎప్పుడూ విభిన్నమైన పాత్రలు చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ పాత్ర పూర్తిగా విలక్షణమైనదిగా కనిపిస్తుంది. మామా మశీంద్ర అనే టైటిల్ నైట్రో స్టార్ సుధీర్ బాబు మల్టీ షేడ్ క్యారెక్టర్ సూచిస్తుంది. పరశురామ్ లుక్ (Look) ని ఈ నెల 4న, డీజే లుక్ ని 7న విడుదల చేయనున్నారు.

సృష్టి సెల్యులాయిడ్ కి చెందిన సోనాలి నారంగ్, సృష్టి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందుతోంది. వినూత్నమైన కాన్సెప్ట్ తో యాక్షన్ ఎంటర్ టైనర్గా రూపొందించబడిన ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు నటించారు, ఇందులో అగ్రశ్రేణి సాంకేతిక బృందం పని చేస్తోంది. చైతన్ భరద్వాజ్ సౌండ్ ట్రాక్ లను అందించగా, పిజి విందా సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. రాజీవ్ ఆర్ట్ డైరెక్టర్.

Also Read: Naveen Polishetty-Anushka: మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టిగా అనుష్క, నవీన్ పోలిశెట్టి

  Last Updated: 02 Mar 2023, 12:22 PM IST